గిరిజన మైనర్ బాలిక హత్యపై రాష్ట్ర మంత్రి “శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు” ని కలిసిన లంబాడీల ఐక్యవేదిక ~ LIVE ప్రతినిధులు.
లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ అధ్యర్యంలో మియాపూర్ నడిగడ్డ తండాలో డోర్నకల్ నియోజక వర్గము, మరిపెడ మండలం, ఏళ్లంపేట లక్ష్మ నాయక్ తండా నుండి బ్రతుకు దెరువుకు హైదరాబాద్ కు వలస వచ్చిన బానోత్ నరేష్, శారద దంపతుల కుమార్తె మైనర్_గిరిజన బాలిక బానోత్ వసంత బాయి 12 సంవత్సరాలు అదృశ్యం, హత్యపై సమగ్ర విచారణ జరిపి నిందితులను వెంటనే గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరిన లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర బృందం.
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించి నిందితులు ఎంతటివారైనా వెంటనే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు, మరియు తప్పకుండ బాధిత గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం పరంగా ఆదుకుంటామని హామి ఇచ్చారు.
మంత్రి గారిని కలిసిన వారిలో లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త రమేష్ నాయక్ గారు, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ రాజేశ్ నాయక్ , కిషన్ నాయక్ గారూ, ప్రసాద్ బుక్య, అంగోత్ రాంబాబు, జాటోత్ సంజీవ్ నాయక్, ఇస్లావత్ శరత్ నాయక్, మూడవత్ రాజు నాయక్, అడే శంకర్ నాయక్, కృష్ణ కుమార్ రాథోడ్, బుక్యా రవి రాథోడ్, ధరవత్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.