PoliticalTelangana

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా..

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా..

ప్రేమించి వాడుకుని వదిలేశాడు అంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా. ప్రేమించి అన్ని విధాలుగా వాడుకుని పెళ్లి ప్రస్తావన రావడంతో ప్రియుడు మొఖం చాటేశాడు.దీంతో ఆగ్రహానికి గురైన ప్రియురాలు ప్రియుని ఇంటి ముందు ధర్నాకు దిగింది.

సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె కవిత, పల్లె శ్రీకాంత్ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇరు కుటుంబాలకు తెలియకుండా ప్రేమించుకుంటున్నారు.

ప్రియురాలు ఇటీవల ప్రియునితో పెళ్లి ప్రస్తావన తీసుకరావడంతో ముఖం చాటేయడమే కాకుండా, అమ్మాయి ఎవరో తనకు తెలియదని, ఎటువంటి సంబంధం లేదని ప్రియుడు తేల్చి చెప్పడంతో ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ప్రియుని ఇంటి ముందు ధర్నాకు దిగింది.

దీంతో అక్కడ ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి శ్రీకాంత్ ను దుబ్బాక పోలీస్ స్టేషన్కు తరలించారు.

అమ్మాయి మాత్రం శ్రీకాంత్ పెళ్లి చేసుకునేంత వరకు నిరాహార దీక్షను విరమించబోమని ప్రియుని ఇంటి ముందే కూర్చుంది. శ్రీకాంత్ తో పెళ్లో, మరణించడమో తేలేదాక ధర్నాను విరమించనని భీష్మించుకొని కూర్చుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button