PoliticalsuryapetaTelangana

అపర భగీరధుడు మంత్రి ఉత్తమ్

అపర భగీరధుడు మంత్రి ఉత్తమ్

ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం వేడుకలు

హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన

కాంగ్రెస్ యువ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ( రామయ్య) జూన్ 20

మఠంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పరుగులు పెడుతుందని మునుపెన్నడు జరగని అభివృద్ధి ఉత్తంకుమార్ రెడ్డి తోనే సాధ్యం అవుతుందని ఆయన పట్టుదల కృషి అంకితభావంతో ఏ పని తలపెట్టిన అది ముందుకు వెళుతుందని మండలంలోని ఏ గ్రామాలకు వెళ్లిన రోడ్లు మహర్దశ సంతరించుకున్నాయని రైతులకు లిఫ్టుల విషయంలోనైతే ఇక చెప్పనవసరం లేదని ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీరు అందాలి

పంటలు సస్యశ్యామలంగా పండాలి రైతే రాజు అనే ఉద్దేశంతో ఎన్నో కోట్ల రూపాయలతో లిఫ్టులు మంజూరు చేయించి వాటిని ప్రగతి పదంలో నడిపిస్తున్నారని నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ ని అందించాలని ఉద్దేశంతో కోట్లాది రూపాయలతో సబ్ స్టేషన్ ల నిర్మాణం చేపట్టారని రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తున్నారని అలాంటి మహానాయకుని పుట్టినరోజు ఈ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషించదగ్గ విషయమని వారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుడు వారిని దీవించాలని కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరారు.

ఇట్టి కార్యక్రమంలో పి ఎస్ సి ఎస్ చైర్మన్ జవ్వాజి రామచంద్రయ్య మాజీ సర్పంచ్ కొత్తపల్లి కృపానందం ఎంపిటిసి కటికల నరసయ్య మత్స్యశాఖ అధ్యక్షులు తవి డబోయిన నాగేశ్వరరావు కార్యదర్శి వీరబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చల కూరి బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తపల్లి శౌరి కర్న వెంకటేశ్వర్లు సింగారపు శ్రీను నార్ల శ్రీనివాస్ పులుసు శ్రీను బీకాం గురవయ్య బాలనాగు బొమ్మకంటి గోపి ఉమ్మడి జోసు, చప్పర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button