PoliticalsuryapetaTelangana

ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 20

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 62వ జన్మదిన వేడుకలు పట్టణంలో ఆరో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు హుజూర్నగర్ మాజీ మున్సిపాలిటీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ముత్యాలమ్మ తల్లి దేవస్థానం వద్ద అమ్మవారి ప్రత్యేక పూజలు జరిపి అనంతరం కేక్ కట్ చేసి 2,000 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూ హుజూర్నగర్ ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఆయురారోగ్యాలను భగవంతుడు సంపూర్ణంగా ఇవ్వాలని అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మునుముందు ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి వైస్ చైర్మన్ కోతి సంపత్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, ఎరగాని నాగన్న, యువ నాయకులు చామా కూరి మధుబాబు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, చైర్మన్లు డైరెక్టర్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button