*ఆర్ఐ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం.!*
*ఆదివారం నాడు తలుపులు పెట్టి మరి బాలానగర్ మండల తహశిల్దార్ కార్యాలయంలో పంచనామా .!*
*ఆకస్మికంగా తనిఖీ చేసి ఆర్ఐ ని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.!*
*ప్రైవేటు వ్యక్తులను తెచ్చి పంచనామా ఎలా చేస్తారని ఆగ్రహం!*
*ఆర్ఐ పనితీరును జిల్లా కలెక్టరు దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.!*
*గత కొంతకాలంగా బాలనగర్ మండలంలో ప్రభుత్వ ఇనాం భూములను కాపాడేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి.!*
ప్రభుత్వ కార్యాలయంలో సెలవురోజున ఏం పనులు వెలగబెడుతున్నారంటూ ఓ ఆర్‌ఐపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే… మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి గిరప్పతో రెవెన్యూ రికార్డులకు సంబంధించిన నోట్స్ రాయిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెంటనే అక్కడికి వచ్చి ఆర్‌ఐ వెంకట్‌రెడ్డితోపాటు రికార్డులు రాస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు.
తలుపులు మూసుకొని రికార్డుల ఫైల్స్ రాయడం ఏమిటని ప్రశ్నించారు. జేసీ అనుమతితో సక్సేషన్ రాస్తున్నామని ఆర్‌ఐ సమాధానం ఇవ్వడంతో, జేసీకి ఫోన్ కలపాలని చెప్పారు.
ప్రైవేట్ వ్యక్తులను కార్యాలయంలోకి తీసుకొచ్చి రికార్డులు రాయించడం ఏమిటని నిలదీశారు. సంబంధిత ఆర్‌ఐపై చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ విషయమై కలెక్టర్‌కు ఫోన్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా తాము సెలవు రోజు కూడా కార్యాలయంలో పనులు చేస్తున్నామని ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.