నకిలీ బంగారం బ్యాంక్ లో పెట్టి లక్షలు లోన్ ఎత్తిన వ్యక్తులు అరెస్టు
రిమాండ్ కు తరలించిన సిఐ చరమందరాజు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 25
నకిలీ బంగారం బ్యాంక్ లో పెట్టి లక్షలు లోన్ తీసుకున్న వ్యక్తులను హుజూర్ నగర్ సిఐ చరమందరాజు అరెస్టు చేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల మండలం వైకుంఠ పురం కు చెందిన కేశవరపు రాజేష్ తండ్రి సైదయ్య మరియు ఇంకా ఏడు మంది వ్యక్తులు గరిడేపల్లి మండలం రాయిని గూడెం గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ లో నకిలీ బంగారం పెట్టి అక్రమంగా గోల్డ్ లోన్ తీసుకొని Rs. 53.89,000/- (అక్షరాల యాభై మూడు లక్షల యనభై తొమ్మిది వేల రూపాయలు) తీసుకున్న వ్యక్తులపై బ్యాంక్ వారు చేసిన పిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి ధర్యాప్తు చేపట్టగా
ఇట్టి విషయంలో నిందుతులను పట్టుబడి చేసిన విషయంలో
నిందితులు
A-1 కేశవరపు రాజేష్ S/o సైదయ్య, వయసు. 29సం //లు, కులం: వడ్రంగి, వృత్తి. గోల్డ్ స్మిత్, R/O వైకుంఠ పురం గ్రామం, నేరేడుచర్ల మండలం.
A-2 కేశవరపు వర్శిత భర్త రాజేష్, వయసు. 22 సం //లు, కులం వడ్రంగి, వృత్తి. గృహిణి,గ్రామం వైకుంఠ పురం గ్రామం, నేరేడుచర్ల మండలం.
A-3 కొమెరపూడి వెంకటాచారి తండ్రి నారాయణ చారి, వయసు.58 సం!!లు, కులం. వడ్రంగి, వృత్తి. కార్పెంటర్, గ్రామం చింతకుంట్ల గ్రామం, నేరేడుచర్ల మండలం
A-4 కణితి సాయిరాం తండ్రి సూర్యచారి, వయసు. 19సంలు, కులం. వడ్రంగి, వృత్తి. గోల్డ్ స్మిత్, గ్రామం వైకుంఠ పురం గ్రామం నేరేడుచర్ల మండలం.
A-5 యర్రగోర్ల పరుశురాం తండ్రి దర్గయ్య, వయసు. 28 సం!!లు, కులం. యాదవ్, వృత్తి. గోల్డ్ స్మిత్, గ్రామం ధర్మాపురం, మాడ్గులపల్లి మండలం నల్గొండ జిల్లా
A-6 దోనేటి ముఖేష్ తండ్రి సైదులు, వయసు. 22 సంలు, కులం. ముదిరాజు, వృత్తి. గోల్డ్ స్మిత్, గ్రామం షాబ్ నగర్, మిర్యాలగూడ పట్టణం.
A-7 మోత్కూరి సూర్య తండ్రి పరిపూర్ణ చారి, వయసు. 30సం లు, కులం. వడ్రంగి, వృత్తి. కారు మెకానిక్, గ్రామం శ్రీ నగర్ కాలనీ సూర్యపేట పట్టణం.
A-8 జిల్లేపల్లి నరేందర్ తండ్రి జానయ్య, వయసు. 49 సంలు, కులం, కంసాలి, వృత్తి. గోల్డ్ అప్రయిజర్, గ్రామం బొమ్మకల్లు గ్రామం మాడ్గులపల్లి మండలం,
కేసు వివరాలు
: కేశవరపు రాజేష్ తండ్రి సైదయ్య, వయసు. 29సం //లు, కులం వడ్రంగి,
వృత్తి. గోల్డ్ స్మిత్, వైకుంఠ పురం గ్రామం, నేరేడుచర్ల మండలం. అనునతను గోల్డ్ వర్క్ నేర్చుకొని తదుపరి మిర్యాలగూడ లో రాజేష్ గోల్డ్ వర్క్స్ అని షాప్ పెట్టి తరువాత నష్టాలు రావడంతో అతని అప్పులు తీర్చడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి మరియు నెల్లూరు ల నుండి నకిలీ బంగారు కట్టు (గొలుసు) తయారు చేయించి ఎవరికీ అనుమానం రాకుండా అట్టి బంగారం పై హాల్ మార్క్ KDM 916 ముద్ర వేపించి గరిడేపల్లి మండలం రాయిని గూడెం గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా లో పని చేసే బ్యాంక్ అప్రయిజర్ జిల్లేపల్లి నరేందర్ కు మరియు రాజేష్ కు గల పాత పరిచయంతో అతనితో మాట్లాడి నేను తీసుకవచ్చే బంగారం నిజమైనంది అని నువ్వు దృవీకరిస్తే నాకు మేనేజర్ గారు లోన్ మంజూరు చేయడం జరుగుతుంది.
లోన్ మంజూరు అయ్యాక అట్టి లోన్ లో నీకు కొంత ఇస్తాను అని చెప్పడంతో అట్టి బ్యాంకు లో గోల్డ్ అప్రైజర్ జిల్లేపల్లి నరేందర్ ఒప్పుకున్నాడు అప్పటినుండి రాజేష్ తన పేరు మీద మరియు అతని భార్య వర్షిత మరియు అతని చుట్టాలు కొమెరపూడి వెంకటాచారి కనితి సాయిరాం మరియు అతని స్నేహితులు అర్ర గొర్ల పరశురాములు దోనేటి ముఖేష్ మోతు కూరి సూర్యల చేత నకిలీ బంగారం పెట్టించి బ్యాంకులో అప్రైజర్ నిజమైన బంగారం అని ధ్రువీకరించడంతో బ్యాంకు సిబ్బంది వారి అందరి పేర్ల మీద లోన్లు మంజూరు చేయడం జరిగింది.
ఇట్టి వ్యక్తులు ఆ రోజు అనగా 25- 6 -24 న నేరేడుచర్ల మండలం వైకుంటపురం గ్రామంలోని ఏ వన్ కేశవరపు రాజేష్ తండ్రి సైదయ్య ఇంటి వద్ద ఉన్నారు అని నమ్మదగిన సమాచారం మేరకు పోలీస్ వారు పట్టుబడి చేసి వారి అందరిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్ నిమిత్తం గౌరవ న్యాయస్థానం హుజూర్నగర్ నందు హాజరు పరిచయం అయినది