SBI బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ అరెస్ట్
రామంతపూర్ లో ఈ సంవత్సరం మార్చి నెలలో ఎస్బీఐ బ్యాంకు లో 3.28 కోట్ల కుంభకోణం జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే.
రామంతపూర్ లో ఫిబ్రవరి వరకు గంగ మల్లయ్య భగీరథ ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ గా ఉన్నప్పుడే ఈ కుంభకోణం జరిగిందని.మార్చి నెలలో కొత్తగా బేలగంటి వీర వసంత రామంతాపూర్ బ్రాంచ్ కి మేనేజర్ గా వచ్చిన తర్వాత ఈ కుంభకోణం బయటపడింది.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు పరార్ లో ఉన్నారు.
పోలీసులు గత నాలుగు నెలల నుండి నిందితుల కోసం ముమ్మరంగా వెతకగా రామంతాపూర్ లోని ఎస్బీఐ బ్యాంకులో 3.28 రుణాల కోళ్లగొట్టిన కేసులో ఎస్బీఐ రామంతపూర్ అప్పటి బ్రాంచ్ మేనేజర్ గంగ మల్లయ్య భగీరథ (41) అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఎస్సై మధుసూదన్ తెలిపారు.
ఇప్పటికే రుణాల స్వాహా కేసులో బంజారాహిల్స్ లోని హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్న మరో బ్యాంక్ మేనేజర్ సైదులును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇదే కేసులో మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. సహచర మేనేజర్ సైదులు రిఫరెన్స్ తో కస్టమర్ల పేరుతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి రూ. 3.28 కోట్ల రుణాలను స్వాహా చేసినట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు.