బిసి వెల్ఫేర్ బాలుర సంక్షేమ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఖమ్మం, జూన్ 26:
బుధవారం అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ స్థానిక ముస్తఫానగర్ లోని బిసి వెల్ఫేర్ బాలుర సంక్షేమ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సంక్షేమ హాస్టల్స్ ను ఆసాంతం పరిశీలించిన అదనపు కలెక్టర్ హస్టల్ లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
సంక్షేమ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులు ఏ తరగతి చదువుతున్నారు, పాఠశాలలో తరగతులు ప్రారంభమయ్యాయా, పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందించారా వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన వివరాలను విద్యార్దుల నుంచి తెలుసుకున్నారు. హస్టల్ లో అందిస్తున్న ఆహారం రుచిగా, శుభ్రంగా ఉంటుందా, కోడి గుడ్డు, పండ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నారా వివరాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం హాస్టల్స్ లో స్టాఫ్ టైం టేబుల్ వివరాలను, బాయ్స్ హాస్టల్ లోని టాయిలెట్స్, హాస్టల్ ప్రాంగణం, వంట చేసే ప్రాంతాలను పరిశీలించారు.
స్టోర్స్ లోని సరుకులను పరిశీలించారు. తాజా సరుకులను అందించాలని, హాస్టల్ లోపల, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని అదనపు కలెక్టర్ అన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.