స్విపర్ సోమమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
చేసిన పంచాయతీ ఉద్యోగస్తులు
సోమమ్మ కుటుంబానికి అండగా ఉంటాం ఎంపీఓ ఆంజనేయులు
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూన్ 28
మఠంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నో ఏండ్లుగా పని చేసే స్వీపర్ సోమమ్మ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించినందున శుక్రవారం పెద్దకర్మ కావడంతో ఖర్చుల నిమిత్తం ఎంపీఓ ఆంజనేయులు మరియు మండల గ్రామ కార్యదర్శులు 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.
అదేవిధంగా ఎంపీడీవో ఆఫీస్ తరఫునుంచి 5,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంపీఓ ఆంజనేయులు మాట్లాడుతూ ఆమె ఎన్నో ఏండ్లుగా కార్యాలయంలో స్వీపర్ గా పనిచేస్తూ ఎంతోమంది అధికారులు,నాయకులు మారిన విధులు నిర్వహిస్తున్న
అధికారుల యడల ఆమె కుటుంబ సభ్యులు లాగా మెలుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆఫీసులో అందరి మన్ననలు పొందిన వ్యక్తి సోమమ్మ అని ఆమె మరణం చాలా బాధాకరం అని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆఫీస్ పరంగా వ్యక్తిగతంగా అండగా ఉంటామని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.