నిస్సహాయ స్థితిలో ఉన్న అనాధకు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆపన్న హస్తం.
50 కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు అందజేత.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జూన్ 29,
దుమ్ముగూడెం మండలం చిన్న బండి రేవు గ్రామానికి చెందిన నా అనేవారు ఎవరూ లేక నిలువ నీడ లేక నిస్సహాయ స్థితిలో ఉన్న అనాధ గణప. సత్యం కు మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
50 కేజీల బియ్యం, మంచి నూనె , ఉల్లిపాయలు , టమాటాలు , పచ్చిమిర్చి , కందిపప్పు , పంచదార నిత్యవసర వస్తువులను మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల. మురళి చేతుల మీదుగా సత్యం కు అందజేసే అండగా నిలిచారు.
ఈ సందర్భంగా ట్రస్టు వ్యవస్థాపకులు కొప్పుల. మురళి మాట్లాడుతూ ఆదుకునే వారు లేక, అర్థ ఆకలితో అలమటిస్తూ,, నిలువ నీడ లేక జీవనం సాగిస్తున్న గనప.సత్యం యొక్క నిస్సహాయ పరిస్థితికి చలించి మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్టు వెంటనే స్పందించి మా ట్రస్ట్ సభ్యులు కొలపూడి.వినోద్ బాబు,కొల్లపూడి అమృత వరుణ్ బాబు, రమేష్ , ట్రస్ట్ సభ్యులందరి సహకారంతో మా వంతు సహాయం అందించమని తెలిపారు. అడగగానే స్పందించి ముందుకు వచ్చి సహకారం అందించిన ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే దాతలు ముందుకు వచ్చి నిస్సహాయ స్థితిలో ఉన్న సత్యం ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. భద్రాచలం నుండి వచ్చి బియ్యం, నిత్యవసర వస్తువులు సత్యం కు అందించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చైతన్య , సాయి కుమార్, బాలరాజు, సర్వేశ్,నాగరాజు, తెల్లం. కృష్ణ,గ్రామస్తులు పాల్గొన్నారు.