విధులు నిర్వహిస్తు హెడ్ కానిస్టేబుల్ మృతి
సిద్దిపేట కమిషనరేట్ పరిధి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కుచన్ పల్లి యాదగిరి (52) గుండెపోటుతో మృతి చెందాడు.
పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో త్రీ టౌన్ ఇన్స్ స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్ఐ భాస్కర్, పోలీస్ సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ పరిశీలించి హార్ట్ టాక్ తో చనిపోయినట్లు నిర్దారించారు.
మృతుడు యాదగిరికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. హెడ్ కానిస్టేబుల్ కుచన్ పల్లి యాదగిరి ఆకస్మిక మృతి పట్ల పోలీస్ కమిషనర్ అనురాధ విచారం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
యాదగిరి స్వగ్రామం పొన్నాలలో మృతదేహానికి ఏఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, ఏసీపీ మధు, త్రీ టౌన్ ఇన్ స్పెక్టర్ విద్యాసాగర్, తోటి ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
అంత్యక్రియల నిమిత్తం ప్రభుత్వం తరపున రూ.20వేలు అందజేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ కుచన్ పల్లి యాదగిరి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.