వాజేడు లో ప్రభుత్వ వైద్యుల ర్యాలీ
సి కె న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ప్రపంచ వైద్యదినోత్సవం సందర్బంగా ములుగు జిల్లా వాజేడులో ప్రభుత్వ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. వర్షాకాలం రావడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా దోమతెరలు వాడాలని, జనాలకు అవగాహన కల్పించారు.
ఇళ్లలోకి మురుగునీరు రాకుండా చూసుకోవాలని ఖాళీ టైర్లు, కూలర్లు, తాగి పడేసిన కొబ్బరి బొండాలు ఇలాంటి వాటిలో నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందడానికి అవి ఆవాసాలుగా పనిచేస్తాయని వాటిలో నీటి నిలువ లేకుండా చూసుకోవాలని డాక్టర్ మహేందర్ తెలియజేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగించుకోవాలని డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జ్వరాలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వాసుపత్రిలో రక్తపరీక్ష చేయించుకోవాలని డాక్టర్ మధుకర్ అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మహేందర్ మరియు డాక్టర్ మధుకర్, సూపర్వైజర్స్, ఏఎన్ఎం మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.