లింగ నిర్దారణ, అబార్షన్ లు చట్ట ప్రకారం నేరం
ఏడు నెలల గర్బిణి స్త్రీకి అబార్షన్ తో మహిళ మరణం
మిగతా నేరస్తులు పరార్
వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము
జిల్లా ఎస్ పి సన్ ప్రీత్ సింగ్
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) జూలై 01
లింగ నిర్ధారణ, అబార్షన్, గర్భిణీ స్త్రీ మృతి కేసు కు సంభందించి జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం చాలా ద్రురదృష్టకరం అని ఎస్పి అన్నారు.
ఈ కేసులో విచారణ చేసి దీనికి సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. లింగ నిర్ధారణ చేసిన, దీనికి ప్రోత్సహించిన వారిపై పిఎస్ డిటి చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే వీటికి సంబందించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని ఎస్పి కోరారు.
కేసు వివరాలు వెల్లడించిన ఎస్పి :
మహబూబాద్ జిల్లా, డోర్నకల్ మండలము, బట్టు తండా కు చెందిన బట్టు కృష్ణ మరియు క్రాంతి ల కూతురు అయిన సుహాసిని వయసు. 27 సం.లు , చివ్వెంల మండలములోని ఎంజి నగర్ తండా చెందిన రత్నావత్ హరిసింగ్ కు ఇచ్చి తేదీ 23.05.2019 న వివాహము చేసినారు.
వారికి ఇద్దరు ఆడ పిల్లలు సంతానము. పెద్ద కూతురు జీస్విక, వయసు: 4 సం.లు, చిన్న కూతురు అన్విక, వయసు: 2 సం.లు. ఇద్దరు ఆడపిల్లలు అయిన తర్వాత సుహాసిని ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఆమె భర్త హరిసింగ్ మరియు బందువులు కలిసి సుహాసిని ఆపరేషన్ చేయించుకోవద్దు, వారసుడు మగపిల్లవాడు కావాలి అని ఆమె పై ఒత్తిడి చేసి, మగపిల్లవాడు లేకపోతే వేరే పెళ్లి చేసుకుంటా అని బెదిరించి బలవంతము చేయగా సుహాసిని భయముతో ఆపరేషన్ చేయించుకోలేదు.
సుహాసిని గర్భము దరించగా, వారందరూ కలిసి స్కానింగ్ చేయించుకొమ్మని బలవంతముగా ఆమె భర్త హరి సింగ్ మరియు హరిసింగ్ బందువులు ఆటోలో కోదాడలోని డాక్టర్ గుర్వయ్య హాస్పిటల్ కు సుమారు రెండు నెలల నుండి నాలుగు సార్లు తీసుకొని వెళ్ళి స్కానింగ్ చేయించగా నాలుగవ సారి సుహాసిని గర్భములో ఆడపిల్ల ఉన్నది అని చెప్పగా, ఆమె భర్త మరియు అతని కుటుంబ సబ్యులు కలిసి సుహాసిని ని అబార్షన్ చేయించుకొమ్మని బలవంతము చేసి, తేదీ 24.06.2024 సోమవారం రోజు మృతురాలు సుహాసిని భర్త హరి సింగ్, మృతురాలి తల్లి, తల్లి తండ్రులకు ఫోన్ చేసి సుహాసిని ని కోదాడ హాస్పిటల్ లో చూపిస్తున్నాను
చెప్పి, మృతురాలి ఇద్దరు పిల్లలను ఆమెకు అప్పగించి, అదే రోజు ఆమె భర్త, బందువులు కలిసి హుజూర్ నగర్ లోని న్యూ కమలా హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళి అక్కడ ఖాసిం తో సుహాసినికి అబార్షన్ చేయుటకు మాట్లాడుకొని సిస్టర్ ద్వారా టాబ్లెట్స్ పెట్టించినారు, ఖాసిం తెల్లారి తేదీ 25.06.2024 ఉదయము మృతురాలిని పెద్దవీడు గ్రామానికి తీసుకొని వెళ్ళి అక్కడ అతని ఇంట్లో ఉంచి మరలా అక్కడకు సిస్టర్ ను పిలిపించి సుహాసిని కి టాబ్లెట్ పెట్టించినారు,
మృతిరాలికి ఖాసిం మరియు సిస్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ మరియు ఇంజక్షన్స్ వలన బ్లీడింగ్ అవుచూ అబార్షన్ కానందున వెంటనే ఆపరేషన్ చేయాలని ఖాసిం కారులో మృతురాలిని మరియు ఆమె భర్త, తీసుకొని మటంపల్లి కి తర్వాత కోదాడ కు తీసుకెళ్ళి డాక్టర్ గుర్వయ్య డాక్టర్ హాస్పిటల్ లో చేర్పించగా, మరుసటి రోజు అనగా తేదీ 26.06.2024 న ఉదయము గుర్వయ్య డాక్టర్ వచ్చి సుహాసిని కి స్కానింగ్ చేసి సీరియస్ గా ఉన్నది,
ఈమెను బెటర్ ట్రీట్ మెంట్ గురించి ఖమ్మం తీసుకవేళ్లు అని చెప్పగా అక్కడి నుండి సుహాసిని ఖమ్మం లోని ప్రశాంతి హాస్పిటల్ కు తీసుకవెల్లి చేర్పించగా అక్కడ డాక్టర్ పరీక్షించి ఈమెకు సీరియస్ గా ఉన్నది,
హైదారాబాద్ తీసుకవెళ్ళండి అని చెప్పగా ఆమెను ఖమ్మం నుండి హైదారాబాద్ తీసుకవేళ్లుచూ సూర్యాపేట సమీపమునకు వచ్చేసరికి అంబులెన్స్ లో సీరియస్ గా ఉండగా సూర్యాపేటలోని డాక్టర్ రామ్మూర్తి హాస్పిటల్ కు సాయంత్రము సుమారు 4:00 గంటలకు తీసుకొని వెళ్ళగా డాక్టర్ చూసి సుహాసిని అప్పటికే చనిపోయినది అని చెప్పగా శవాన్ని ఎంజి నగర్ తండాకు తీసుకొని వెళ్ళినారు.
చివ్వేంల పిఎస్ నందు పిడిఎన్ టి చట్టం ప్రకారం కేసు నమోదు చేసి పరిశోధన చేసి తేదీ 01.07.2024 సోమవారం నేరస్తులు అయిన మృతురాలి భర్త రత్నావత్ హరి సింగ్, షేక్ ఖాసిం న్యూ కమలా హాస్పటల్ మేనేజర్, హుజూర్ నగర్, దేవరకొండ రాణి (నర్సు) హుజూర్ నగర్, రణపంగు గోపి, కాంపౌండర్ విజయ హాస్పిటల్, కోదాడ, షేక్ సైదులు, కాంపౌండర్ విజయ హాస్పిటల్, కోదాడ మరియు అమరగాని నవీన్ గ్రామం తాళ్ల మల్కాపురం లను అరస్ట్ చేసి రిమాండ్ కు పంపుకోనైనది. మిగతా నేరస్తులు పరారీలో ఉన్నారు. కేసు విచారణ చేసి అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఎస్పి తెలిపినారు.
నేరస్తులు అందరికీ, 8 నెలల గర్భవతి అయిన మృతురాలికి గర్భ స్రావం చేస్తే ఆమె ప్రాణానికి హాని అని తెలిసి కూడా మరియు గర్భం లో ఉన్న ఆడపిల్లను చంపాలని మృతురాలికి గర్భ స్రావం చేసినారని ఎస్పి తెలిపారు.ఈ కేసులో డిఎస్పి రవి అధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, ఎస్ ఐ వెంకట్ రెడ్డి, ఎస్ ఐ రత్నం, ఎ ఎస్ ఐ వెంకన్న బాగా పని చేశారని అందరినీ అభినందించారు.