గ్రూప్ 1, గ్రూప్ 2,పోస్టులు పెంచాలంటూ టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ
హైదరాబాదులో టీజీ, పీఎస్సీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పాడింది. పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ఈరోజు ముట్టడించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. గ్రూప్ 2, 3 పోస్టు లు పెంచాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహిం చాన్నారు.
గ్రూప్-1 మెయిన్స్‌కి 1:100 పిలువాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తా మని ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రూప్-2, 3తోపాటు ఉపా ధ్యాయ పోస్టులు చాలావ రకు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఏబీవీపీ ముట్టడి నేపథ్యంలో టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
రోడ్డుపై బైఠాయించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపు లాట జరిగింది. ఒక్కొక్కరిగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.
కాగా, నిరుద్యోగుల సమస్య లు పరిష్కరించాలన్న డిమాండ్‌తో గత తొమ్మిది రోజులుగా గాంధీ దవా ఖానలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్‌నాయక్ దీక్ష విరమించారు.
నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజు లుగా దీక్ష చేస్తున్నానని మోతీలాల్ నాయక్ చెప్పారు. కేసీఆర్ 9 రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది కానీ.. తాను దీక్ష చేస్తే ఒక్క ఉద్యోగం కూడా పెరుగలే దన్నారు.
ఇతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇన్నిరోజులు అన్నపానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశా. తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్ లెవల్స్ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది.
తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, కరెంటు వచ్చినయ్. 25 నుంచి 35 ఏండ్ల వయ స్సు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కొత్త ప్రభు త్వం రాగానే తమ డిమాం డ్లు పరిష్కరిస్తామని చెప్పారు.
కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలే. ఈ ప్రభుత్వా నికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యో గులపై లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తా నంటే సర్కారు ఒప్పుకోలే దు,మనుషులు చచ్చిపో యినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?.
నా ఫోన్ లాక్కుని ఎవరితో నూ మాట్లాడనీయడం లేదు. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలి. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పారు…