శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం అక్రమంగా ముద్రించి విక్రయిస్తున్న పుస్తకాల స్టోర్ రూమ్ సీజ్.
- పి డి ఎస్ యు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జూలై 05,
శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం భద్రాచలం లోని రాజుపేట కాలనీలో రహస్యంగ ఒక గోడం ఏర్పాటు చేసుకొని పుస్తకాలను విద్యార్థులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారని తక్షణమే శ్రీ చైతన్య విద్యాసంస్థ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ జిల్లా నాయకులు మునిగల శివ ప్రసాద్ డిమాండ్ చేశారు.
భద్రాచలం పట్టణంలో పి డి ఎస్ యు. భద్రచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ చైతన్య సంస్థల బుక్ స్టోర్ రూమ్ ముందు ఆందోళన చేపట్టారు వారు రహస్యంగా పుస్తకాలు విక్రయిస్తున్నారని స్థానిక ఐటిడిఏ పిఓ, విద్యాశాఖ అధికారి డీఈవో భద్రాచలం ఎంఈఓ లకు సమాచారం ఇచ్చారు. పి డి ఎస్ యు. నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టి చేసే అంత వరకు పోరాటం కొనసాగించింది.
ఈ సందర్భంగా పి డి ఎస్ యు. నాయకులు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలు విద్యార్థులకు అక్రమ పుస్తకాలను ముద్రించి విద్యాస్థలి పేరుతో బిల్లులు మంజూరు చేసి విద్యార్థుల కు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న స్థానిక విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎలాంటి స్పందన లేకుండా యాజమాన్యాలకు సహకరించే విధంగా విద్యాశాఖ అధికారుల పాత్ర ఉందని ఇది దుర్మార్గ మని వారు అన్నారు.
కేవలం 1000 రూపాయలకు వచ్చే పాఠ్య, నోట్ పుస్తకాలను పది రెట్లు ధరను పెంచి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు బలవంతంగా ఒత్తిడి గురిచేసి పాఠ్యపుస్తకాలను మా దగ్గరే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించి లక్షలాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని వారు తెలిపారు.
పుస్తకాల దందాను పి డి ఎస్ యు బహిరంగం చేయడంతో నిస్సిగ్గుగా శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ ఈ స్టోర్ రూమ్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని తెలుపుతూ నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చాడని వారు అన్నారు. కానీ శ్రీ చైతన్య పేరు తో,పాఠశాల లోగోతో పుస్తకాలు ఎలా ముద్రించి విక్రయిస్తున్నారని ప్రశ్నించడంతో వారి అంతర్గత విషయాలు బహిర్గతం అయినాయని వారు అన్నారు.
పెట్టకేలకు అసలు విషయాలు తెలియడం తో పిఓ స్పందించి అక్రమంగా విక్రయిస్తున్న సుమారు 6 నుండి 8 లక్షల విలువ చేసే పుస్తకాలను భద్రాచలం తాహసిల్దార్ శ్రీనివాస్ సమక్షంలో పంచనామా చేసి పుస్తకాలను సీజ్ చేసి నన్నపనేని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక రూమ్ ను కేటాయించి పుస్తకాలను తమ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు చర్యలు చేపట్టారు.
తక్షణమే శ్రీ చైతన్య విద్య సంస్థ ఫీజుల దోపిడిని అక్రమ పుస్తక దందాను నియంత్రించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు అర్జున్ తులసిరాం తదితరులు పాల్గొన్నారు.