ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని
దళిత సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన
సి కే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాదావత్తు హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలంలో అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ పురుగులు మందు తాగి బలవన్మరణానికి పాల్పడగా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దీనితో శ్రీనివాస్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో జూలూరుపాడు మండలం జూలూరుపాడు అంబేద్కర్ సెంటర్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం ఎస్సై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ….. ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్న వారందరి పైన చర్యలు తీసుకోని వారిని ఉద్యోగాల నుండి సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఒక దళిత ఎస్సై స్థాయి అధికారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడినదాన్ని బట్టి దళితులపై ఏవిధమైన వివక్ష కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు సైతం ఎస్సై తనకు అవమానం జరిగిందని ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించకపోవడం శోచనీయం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో దళిత నాయకులు వేల్పుల నరసింహారావు, తెలంగాణ ఎమ్మార్పీఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మోదుగు రామకృష్ణ, పోతురాజు నాగరాజు నాగరాజు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు చెంగల గురునాథం, సిపిఎం మండల నాయకులు, వలమల చందర్రావు, మండల అధ్యక్షులు దెబ్బందుల సాయి, మాల మహానాడు నాయకులు, ఇలంగి తిరుపతి, వేమూరి కనకయ్య, సురేష్, ప్రభాకర్, మంద దేవేందర్, నారపోగు నరసింహారావు, పోతురాజు రాము, తదితరులు పాల్గొన్నారు,