ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
రాష్ట్ర బిజెపి కిషన్ మోర్చా కార్యదర్శి చిలుకూరి రమేష్
సి కే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గం బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు తాసిల్దార్ కార్యాలయం ఎదుట బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధర్నా నిర్వహించడం జరిగినది* అనంతరం తాసిల్దార్ కి మెమోరండం అందజేయడం జరిగినది.
ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కమిటీల పేరుతో కాలయాపన చేయడాన్ని బిజెపి కిసాన్ మోర్చా తీవ్రంగా నిరసిస్తుంది
ఇది యావత్ తెలంగాణ రైతుల్ని మోసం చేయడం మంచి పద్ధతి కాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకు ఎంత అప్పు ఉన్నా సరే రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలి,
రైతు భరోసా పేరుతో సాగు చేస్తున్న ప్రతి ఎకరాకి రైతు భరోసా కింద ఖరీఫ్ రబీ కలుపుకొని 15000 రూపాయలు ఆర్థిక తోడ్పాటును వెంటనే అందించాలి, కౌలు రైతులకు సైతం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా సంవత్సరానికి 15000 రూపాయలు ఆర్థిక సహకారం అందించాలి,
వ్యవసాయ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని సంవత్సరానికి 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి, తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా యోజన వెంటనే అమలు చేయాలి అని కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీషు ,జిల్లా నాయకులు నున్న రమేష్ ,బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, మండల కార్యదర్శి భూక్య రమేష్, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సిరిపురపు పుల్లారావు, నిమ్మటూరి రామారావు, గోపాల్ రావు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.