రేపు ఖమ్మం జిల్లాలో నలుగురు మంత్రుల పర్యటన
- భట్టి, కోమటి రెడ్డి, తుమ్మలతో కలిసి ఐడిఓసిలో రైతు భరోసా జిల్లాస్థాయి వర్క్ షాప్ నకు హాజరు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉదయం 10:30 గంటలకు రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెంలోని ఐడిఓసిలో జరిగే రైతు భరోసా జిల్లా స్థాయి వర్క్ షాప్ నకు హాజరవుతారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు కూసుమంచి మండలం పోచారంలో గ్రామపంచాయతీ నూతన భవనాన్ని మంత్రి పొంగులేటి ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 4గంటలకు నాయకన్ గూడెంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.
ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ఈశ్వర మాదారంలో హై లెవెల్ బ్రిడ్జి, సాయంత్రం 5:30 గంటలకు తిరుమలాయపాలెం మండలం రాకాసి తండాలో హై లెవెల్ బ్రిడ్జి, చెక్ డ్యాములను మంత్రి పొంగులేటి ప్రారంభిస్తారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.