అక్రమ మైనింగ్ పై చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం
తాహసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పరమేశ్వర క్రషర్
ఎలాంటి అనుమతులు లేకుండా 70 ఫీట్ల ఎత్తులో బ్లాస్టింగ్
అక్కడికక్కడే మృతి చెందిన కార్మికుడు
(బిఎన్ఎస్) భారతీయ న్యాయ సంహిత చట్టం105, కింద కేసు నమోద
అధికారుల నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు
సి కె న్యూస్ షాద్ నగర్: జులై 10
పోట్ట చేత పట్టుకొని వచ్చిన ఇతర రాష్ట్రాల కార్మికుల ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి అనుకున్నారు కానీ ఇంతకాలం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పక్కనే ఆనుకొని ఉన్న నల్గొండ జిల్లాకు చెందిన కార్మికుడి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయిన ఘటన ఇది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండల పరిధిలో గత కొంతకాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా పరమేశ్వర క్రషర్ బ్లాస్టింగ్ లో సుమారు 70 ఫీట్ల ఎత్తులో బ్లాస్టింగ్ జరుగుతుండగా అక్కడి నుండి కార్మికుడు రవి ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు క్రషర్ యాజమాన్యం నిర్లక్ష్యంగానే ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా కార్మికులతో పనిచేయిస్తుండడం ప్రమాదవశాత్తు కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తుండడం ఇది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పరిశ్రమల్లో, క్రషర్లలో, జరుగుతూ కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి
అస్సలు అనుమతులు లేకుండా ఇంత కాలంగా ఇంత పెద్ద క్రషర్ లో పనులు జరుగుతుంటే చర్యలు తీసుకోవాల్సిన స్థానిక అధికార యంత్రాంగం నిద్రమత్తులో కూరుకుపోయిందా లేకపోతే క్రషర్ యాజమాన్యాలు ఇచ్చే అమ్యామ్యాలకు అలవాటు? పడ్డారా అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి
తాహసిల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే పరమేశ్వర క్రషర్ లో అనుమతులు లేకుండా కార్మికులతో 70 ఫీట్ల ఎత్తులో నుండి బండారాలను బ్లాస్ట్ చేయిస్తుంటే అధికార యంత్రాంగం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందనేది మరో ప్రశ్న అయితే కార్మికుడు మృతి చెందిన క్రమంలో అటు పోలీసులకు ఇటు కుటుంబ సభ్యులకు తెలియకుండానే అక్కడి నుండి నేరుగా శవాన్ని షాద్
నగర్ కమ్యూనిటీ ఆసుపత్రి మార్చురికి తరలించారు క్రషర్ యాజమాన్యం విషయం బయటికి పోక్కకుండా లోలోపలనే ఉంచారు ఆ నోట ఈ నోట సోషల్ మీడియా, మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో క్రషర్ యాజమాన్యం కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది ..
పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు.!
బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కేసు నమోదు..!
క్రషర్ లో పనిచేస్తూ అక్కడికక్కడే మృతి చెందిన
మృతుడి రవి, భార్య రమా ఫిర్యాదు మేరకు కొందుర్గ్ మండల పోలీసులు బి, భారతీయ న్యాయ సంహిత 105 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ప్రమాదం జరిగి ప్రాణాలు పోతాయి అనేది తెలిసిన సేఫ్టీ పరికరాలు వాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు పోలీసులు..