గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరికీ కఠిన కారగారి శిక్ష.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
జూలై 10,
గంజాయి అక్రమ రవాణా కేసులు ఇద్దరికీ కఠిన కారగారి శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ( ఫుల్ అడిషనల్ చార్జ్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, స్పెషల్ జడ్జి ఫర్ ఎన్ డి పి ఎస్ ) ఇద్దరికీ పన్నెండు సంవత్సరాల కఠిన కారా గార శిక్ష ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు.
కేసు వివరాలు ఇలా….. భద్రాచలం కు చెందిన తాడి శివ శంకర్ ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్ గిరి జిల్లా బాపనపల్లి కి చెందిన ఆజగర్ ఖాన్ @ సంతోషులు 2023 జూన్ 16న సిఆర్పి క్యాంపు కూనవరం రోడ్డు భద్రాచలం నందు మారుతి ఈకో వ్యాన్లో 242 గంజాయి పొడి ప్యాకెట్లు యూనికాన్ మోటార్ సైకిల్ లో నాలుగు కిలోల అక్రమ రవాణా చేయుచుండగా అప్పటి భద్రాచలం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీకాంత్ తన సిబ్బందితో వాహనం తనిఖీ చేయుచుండగా వేగంగా వచ్చుచున్న
వీరి వాహనాలను ఆపి పరిశీలించగా పొడి గంజాయి ప్యాకెట్లు లభ్యమవుగా మొత్తము తూకము 484 కెజిలు వాటి విలువ రు. 96,80,000/- కలదుగా గుర్తించి పంచుల సమక్షంలో పంచనామా ద్వారా స్వాధీనం చేసుకొని భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు భద్రాచలం సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు,
ఒడిస్సా రాష్ట్ర మల్కాన్ గిరి జిల్లాకు చెందిన త్రినాథ్,పాపారావు, ఏలియాస్ పప్పు సింగ్, తాతారావు @ రాజు, మడకం రాము, బాబి, ఢిల్లీకి చెందిన నంద, అభయ్ అను వారు దొరక నందున కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో సప్లమెంటరీ చార్షీట్ వేస్తామని పోలీసు అధికారులు కోర్టు కు వివరించారు. కోర్టులో నలుగురు సాక్షులను విచారించారు.
వాదనల అనంతరం తాడికొండ శివశంకర్, ఆజగర్ ఖాన్ @ సంతోష్ లపై నేరము రుజువు కాగా ఇద్దరికి 12 సంవత్సరంల కఠిన కారాగార శిక్ష, విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రొసిస్క్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావి విజయ్ కుమార్ నిర్వహించగా, లైజాన్ ఆఫీసర్ ఎం.హరి గోపాల్ (కోర్టు డ్యూటీ ఆఫీసర్) భద్రాచలం పి. సి.సుధీర్ బాబు లు సహకరించారు.