KhammamPoliticalTelangana

అక్రమ కట్టడాలు : చర్యలు శూన్యం

అక్రమ కట్టడాలు : చర్యలు శూన్యం

అక్రమ కట్టడాలు : చర్యలు శూన్యం

  • పలు దఫాలుగా విన్నవించిన స్పందించని అధికారులు
  • ఫిర్యాదు చేసిన వారిపై నే కేసులు
  • ప్రజా ప్రతినిధుల ప్రమోయం ఉందనే అనుమానాలు
    డాక్టర్ కె.వి. కృష్ణారావు

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం : మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా సాగుతున్న అక్రమ కట్టడాలపై అనేక దఫాలుగా విన్నవించిన అధికారులు స్పందించక పోవడం , ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో భూమిని కబ్జా చేసి , వెంచర్ల రూపంలో నిర్మాణాలు , రోడ్లు .. పైగా ఫిర్యాదు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం గమనిస్తుంటే ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమోయం ఉందనే అనుమానాలు కలుగుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవీ కృష్ణారావు అన్నారు. శుక్రవారం వివిధ సంఘాల నాయకులతో , బాధితులతో కలిసి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని రోటరీ నగర్ అంతర్భాగ శ్రీనగర్ కాలనీ రోడ్డు నెంబర్ 15 లో సర్వే నెంబరు లో 3 ఎకరాల 10 కుంటల స్థలాన్ని 2011లో చేపూరి పద్మ , సంధ్యారాణి లు కొనుగోలు చేశారని చెబుతుండగా మరోవైపు కొందరు ఇది తమ భూమి అని పేర్కొంటూ ఆ భూమిలో బలవంతంగా ప్రవేశించి , మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా , హైకోర్టు జిల్లా కోర్టు లలో తుది తీర్పు పెండింగ్ ఉండగా ఇలా ప్రవేశించి , నిర్మాణాలు చేపట్టడం అమానుషమన్నారు. కమిషనర్ కు దీనిపై గతంలోని ఫిర్యాదు చేసామని, అయినప్పటికీ చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సివిల్ మ్యాటర్ కాస్తా శాంతి భద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు చేపట్టక పోవడం వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమోయం ఉందా ఏమిటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని సందేహాన్ని వ్యక్తం చేశారు. అధికారులే విషయాన్ని నిగ్గు తెల్చాలని కోరారు.

రాష్ట్రంలోనే ప్రశాంత వాతావరణ కలిగిన జిల్లా కేంద్రం ఖమ్మంలో ఇటువంటి దౌర్జన్యాలు జరగడం అధికారులు చర్యలు చేపట్టకపోవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉంటున్నామా ? అనేది అర్థం కావడం లేదన్నారు. ఇప్పుడైనా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సానుకూలంగా స్పందించి ఈ అక్రమ నిర్మాణాలను ఆపు చేయాలని , నిందితుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

వినతి పత్రం సమర్పించిన బృందంలో బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు చెరుకుపల్లి నాగేశ్వరరావు , రాష్ట్ర నాయకులు ఉపేంద్ర సాహూ , జిల్లా కార్యదర్శి మిర్యాల నాగరాజు , జిల్లా నాయకులు లాజర్ ,తెలంగాణ ఉద్యమకారులు రాచమల్ల ఉమా యాదవ్ , రెడ్డి బోయిన వరలక్ష్మి , మహాత్మ జ్యోతిబా పూలే సొసైటీ అధ్యక్షులు పెల్లూరి విజయ్ కుమార్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు భానుతు బద్రు నాయక్ , ఎంబీసీ జిల్లా చైర్మన్ బాసాటి హనుమంతరావు , తెలంగాణ ఉద్యమకారులు బాలిన భాస్కర్ రెడ్డి , శ్రీనివాస్ నాయక్ , వీరనారీమణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఝాన్సీ , నాయకులు స్పందన , దేవుళ్ళ నాగేశ్వరరావు, తాడోజు వెంకటాచారి , కామన అనంతలక్ష్మి , చౌడం పద్మ , యాలమూడ ధనలక్ష్మి, ఆకారపు కృష్ణవేణి , ముల్లంగి పద్మ ,బాధితులు చేపూరి పద్మ , శ్రావణి ,నైనీషా ,నవజ్యోత్త్ తదితరులు ఉన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!