గాండ్ల కుల ఐక్యత,సంక్షేమమే ఏకైక లక్ణ్యం
!)రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ గాండ్ల
పలమనేరు,జూలై 14 సి కె న్యూస్
ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి ఆశీస్సులతో గాండ్ల ఉద్యోగులు , ప్రజలు చైతన్యమై అభివృద్ధి చెందాలని చిత్తూరు నగరం ఏం.సీ.పీ.ఏస్. జైహింద్ పాఠశాలలో ఆదివారం జరిగిన ఎజిటియుపిఎస్ఎస్ చిత్తూరు జిల్లా గాండ్ల ఉద్యోగుల, ఉపాద్యాయుల, పెన్షనర్ల సంక్షేమ సంఘం యొక్క సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికృష్ణ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం భాగంగా జరిగిన జిల్లా ఎన్నికలను ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గాండ్ల ఉద్యోగులు సమైక్యంగా ఉండి ఒకరికొకరు ప్రభుత్వ పధకాలను కుల ప్రజలకి చేరువ చేయాలని వక్తలు పిలుపు నిచ్చారు.
నూతన కార్యవర్గం*
జిల్లా ఎజిటియుపిఎస్ఎస్ ఎన్నికలలో చిత్తూరు గౌరవాధ్యక్షులుగా వెంకటరమణ , జిల్లా అధ్యక్షులుగా ఏ.ఆర్.కుమార్ , ప్రధాన కార్యదర్శిగా మోహన్ శెట్టి ,కోశాధికారిగా బాలసుబ్రమణ్యం,ఉపాధ్యక్షులుగా జగదీష్ , ఏకాంబరం, జిల్లా మహిళా కార్యదర్శిగా సుజాత లు ఎన్నికయ్యారు.
ఇంకనూ కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాసులు, లక్ష్మీపతి తదితరులను ఎన్నుకొన్నారు.
సంఘం బలోపేతానికి కృషి
జిల్లాలో సంఘాన్ని బలోపేతం చేసి ,గాండ్ల ఉద్యోగుల సమస్యలని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కులాభివృద్దికి ముందుంటామని కొత్తగా ఎన్నికైన జిల్లా ఏజిటియూపిఎస్ఎస్ అధ్యక్షుడు ఏ.ఆర్.కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కార్యవర్గమును విస్తరించి సంఘాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు.
కాగా నూతనంగా నియమితులైన జిల్లా అధ్యక్షులు ఏ.ఆర్.కుమార్ ను సహచర ఉపాధ్యాయులు,రాష్ర్ట1998 డీఎస్సీ అధ్యక్షులు సోమశేఖర్ రెడ్డి,ముత్యాలు శెట్టి తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శోళీంగర్ గిరిశ్రీనివాస్ తో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాండ్ల మురళి,రాష్ట్ర కోశాధికారి ఆర్కాట్ హేమాద్రి , చిత్తూరు జిల్లా గాండ్ల సంక్షేమ సంఘం కార్యదర్శి కాణీపాకం గిరి తదితరులు పాల్గొన్నారు.