నూతన చట్టాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్సై రాణా ప్రతాప్
ఎస్సై రాణా ప్రతాప్ ను శాలువాతో సత్కరించిన ఆటో డ్రైవర్లు
సీకే న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో, నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బానోతు రానా ప్రతాప్ మండల ఆటో డ్రైవర్లతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ విధిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని, విధిగా యూనిఫామ్ ధరించాలని, తరచూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉంటామని, Rash డ్రైవింగ్ చేయకూడదని, ఆటోలు ఎక్కే మహిళల పట్ల గౌరవంగా మెలగాలని మహిళలు ఆటో లో ఉన్న సమయంలో ఎలాంటి చెడు ఘటనలు చేసినచో చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరూ నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేసినారు. నూతన ఎస్.ఐ గా బాధ్యతలు స్వీకరించిన రాణా ప్రతాప్ కి ఆటో డ్రైవర్లు శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు .
ఈ కార్యక్రమంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పాపకొల్లు ఆటో అడ్డ అధ్యక్షులు పత్తిపాటి మహేష్ ఉపాధ్యక్షులు మోదుగు దానెల్ కార్యదర్శి గార్లపాటి వీరభద్రరావు చండ్రుగొండ ఆటో యూనియన్ అధ్యక్షులు మలకం వెంకటేశ్వర్లు సూరారం ఆటో అడ్డా అధ్యక్షులు నరసాపురం ఆటో అధ్యక్షులు కాకర్ల ఆటో అద్యక్షులు ఐదు అడ్డాల ఆటో అధ్యక్షులు ఆటో డ్రైవర్లతో ఎస్సై రాణా ప్రతాప్ సమావేశం నిర్వహించి తగు జాగ్రత్తల గురించి నూతన చట్టాల గురించి వివరించారు అనంతరం ఆటో డ్రైవర్లు అందరూ ఎస్సై రాణా ప్రతాప్ శుభాకాంక్షలు తెలియజేశారు