KhammamPoliticalTelangana

CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

CMRF చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం

గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా.. మేం రోగులను ఆదుకుంటున్నాం

ఎల్ఓసిల ద్వారా 120మందికి పైగా రూ.కోటి వరకు అందజేత

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

కూసుమంచిలోని క్యాంప్ కార్యాలయంలో 132 మందికి రూ.32.66లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

సికె న్యూస్ ప్రతినిధి

కూసుమంచి: పేదల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

కూసుమంచిలోని తన క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గం నాలుగు మండలాల పరిధిలోని 132 మందికి రూ.32,66,500 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాంపు కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి ఆదివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అనారోగ్య కారణాలతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరఫున బాధ్యతగా నేరుగా ఆర్థిక సాయం అందజేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రోగులకు కనీసం సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఇవ్వలేదని అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక .. పెండింగ్ వాటిని కూడా మంజూరు చేశామని అన్నారు.

ఇంకా మెరుగైన చికిత్స కోసం పాలేరు నియోజకవర్గంతో పాటు ఇతర నియోజక వర్గాలకు చెందిన 120 మందికి పైగా అనారోగ్య బాధితులకు ఎల్ వోసీల ద్వారా రూ. కోటికి పైగా ఇప్పించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమoలో..: కాంగ్రెస్ మండలాధ్యకులు కళ్లెం వెంకటరెడ్డి, బెల్లం శ్రీను, మట్టే గురవయ్య, కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, కొప్పుల అశోక్, నాయకులు తమ్మినేని నవీన్, బజ్జూరి వెంకట రెడ్డి, మదాసు ఉపేందర్, హఫీజుద్ధీన్, మద్ది మల్లారెడ్డి, భుజంగ రెడ్డి, భీష్మాచారి, పెండ్ర అంజయ్య, రామిరెడ్డి, నాగేశ్వరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button