ఖమ్మం లో అరాచక శక్తులు పై ఉక్కుపాదం
అక్రమార్కులను హడలెత్తిస్తున్న మంత్రి తుమ్మల
భూ కబ్జాలు చేసిన కార్పొరేటర్లు జైలుకు
58 59 జీవోలు అడ్డుపెట్టుకొని చేసిన భూకబ్జాలు గుట్టురట్టు
బీ.ఆర్.ఎస్ మాజీమంత్రి అనుచరులను వెంటాడుతున్న కబ్జా కేసులు
గతానికి భిన్నంగా మారిన మంత్రి తుమ్మల వ్యవహార శైలి
పాలనతో పాటు పార్టీ నేతలకు సమయం కేటాయింపు ప్రాధాన్యం
ఖమ్మం లో భూ కబ్జాదారులు హడలిపోతున్నారా?
గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వంలో అధికారం మాటున చేసిన అక్రమాలు ఇపుడు వారికి శాపంగా మారాయా?
మాజీ మంత్రి అనుచరులు భూ కబ్జా కేసుల్లో ఎందుకు జైలు పాలవుతున్నారు?
అరాచక శక్తులకు మంత్రి తుమ్మల సింహ స్వప్నంగా మారారా?
గతానికి భిన్నంగా తుమ్మల పాలన వ్యవహారాలే కాదు
పార్టీ నేతలు కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేస్తోన్నారా?
ఇంతకీ తుమ్మల పొలిటికల్ డ్రీమ్ ప్రాజెక్ట్ క్లీన్ అండ్ స్మార్ట్ ఖమ్మం విశేషాలేమిటో తెలియాలంటే వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ..
ఖమ్మం ..ఉద్యమాల గుమ్మంగా రాజకీయ చైతన్యానికి ఖిల్లాగా ఉన్న నియోజకవర్గం. గత ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకం అవినీతి భూకబ్జాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల పిలుపునివ్వగా ఖమ్మం ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకే జై కొట్టారు. ఊహించిన దానికంటే ఎక్కువగా భారీ మెజార్టీతో తుమ్మల విజయం సాధించారు.
బి.ఆర్.ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హయాంలో ఖమ్మం నగరంలో అంతులేని అరాచకం భూకబ్జాల తో ప్రజలు విసిగిపోయారని ,ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తుమ్మల పిలుపుకు తగ్గట్టుగా ఫలితం కనిపించింది..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో తుమ్మల మంత్రిగా నియామకం అవ్వడం తో ఎన్నికల వాగ్దానం ప్రకారం ఖమ్మం నగరంలో అరాచక శక్తులపై భూకబ్జాదారులపై తుమ్మల ఉక్కు పాదం మోపుతున్నారు. భూ కబ్జాలకు పాల్పడ్డ మాజీ మంత్రి అనుచరుల అక్రమ ఆస్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ అక్రమార్కులను జైలు ఊచలు లెక్కపెట్టిస్తున్నారట.
ఖమ్మం నగరంలో అరాచక శక్తులపై భూకబ్జాదారులపై ఉక్కు పాదం మోపాలని మంత్రి తుమ్మల ఆదేశాలతో పోలీసు యంత్రాంగం ,రెవెన్యూ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నారు.
మాజీ మంత్రి అనుచరుడు బీ.ఆర్.ఎస్ పట్టణ అధ్యక్షుడు భూకబ్జాపై దృష్టి పెట్టిన పోలీస్ రెవిన్యూ యంత్రాంగం బైపాస్ రోడ్ రామాలయం సమీపంలో ఖరీదైన స్థలంలో అక్రమ నిర్మాణం చేసిన రేకుల షెడ్డులు జెసిబి లతో కూల్చివేశారు. ఆ ఘటనతో అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తాయి. కోట్లు విలువ చేసే ఖరీదైన స్థలాన్ని దొంగ ఇంటి నెంబర్లు వేసి 59 జీవో కింద క్రమబద్ధీకరణ చేసుకున్నారట.
అధికారుల విచారణలో తప్పుడు ఇంటి నెంబర్ తో క్రమబద్ధీకరణ చేసినట్టు విచారణ వెలుగులోకి రావడంతో కబ్జాకు పాల్పడ్డ సదరు బీ.ఆర్.ఎస్ నేతతో పాటు కార్పొరేటర్ గా ఉన్న సదరు నేత భార్యపై కూడా కేసు నమోదు చేశారు .
అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. సదరు కార్పొరేటర్ దంపతులు తమ రాజకీయ భవిష్యత్తుపై అయోమయంలో ఉన్నారట. మరో కార్పొరేటర్ 59 జీవోలో ప్రభుత్వ స్థలాన్ని తప్పుడు పత్రాలతో క్రమబద్దీ కరించుకోవడంతో అధికారులు విచారణ చేసి అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.
పలువురు కార్పొరేటర్లు గత బి ఆర్ ఎస్ పాలనలో చేసిన అవినీతి అక్రమాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటుండగా మంత్రి తుమ్మల పై ఖమ్మం నగర వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారట.
వాయిస్ 3… అవినీతి ఖాకీలపై ఉక్కు పాదం…
గత బి ఆర్ ఎస్ పాలనలో మాజీ మంత్రి వద్ద పోలీసులమన్న విషయాన్ని మరచి సుఫారి గ్యాంగులుగా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించారట.
మితిమీరిన అరాచకం ల్యాండ్ సెటిల్మెంట్లు ఖమ్మంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ కేసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు బనాయించడం మాజీ మంత్రి రాజకీయ ప్రత్యర్థులను వేధించడం పనిగా ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు వ్యవహారం పై కోకొల్లలుగా పిర్యాదులు.
బీ.ఆర్.ఎస్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల అక్రమాల అవినీతి దందా పై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్నారట. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మలపై హత్యా ప్రయత్నానికి ఓ పోలీసు అధికారి నేతృత్వంలో పధక రచన జరిగినట్టుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సదరు పోలీస్ అధికారి వీ.ఆర్.ఎస్ తీసుకొని మాజీ మంత్రి కోసం అడ్డగోలుగా వ్యవహరించిన తీరు ఆయన భాదితులు ఇపుడు నోరు విప్పడం తో సదరు ఖాకీ తీరు పై పోలీస్ శాఖ లో తీవ్ర చర్చ సాగుతుందంట.. మాజీ మంత్రితో అంట కాగిన ఓ సీఐ తాజాగా సస్పెన్షన్ అయ్యారు.
ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేసిన ఆ సీఐ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వారిని ఓ జర్నలిస్టును అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టినందుకు పోలీస్ ఉన్నతాధికారుల విచారణతో సీఐ అక్రమాలు నిర్దారణ కావడం తో సీఐ సస్పెన్షన్ అయ్యారు.
ఓ పక్క కబ్జాలకు పాల్పడ్డ కార్పొరేటర్లను జైలుకు పంపించడం మరో పక్క అవినీతి అధికారుల గుట్టురట్టు చేస్తూ వారిపై చర్యలు తీసుకోవడంతో, మంత్రి తుమ్మల వ్యవహార శైలిపై పార్టీలకతీతంగా ఖమ్మంలో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉండాలంటే.. చైతన్యవంతమైన ఖమ్మంలో ఆరాచక శక్తులు లేకుండా ఇలాగే ఉండాలని ఖమ్మం నగర వాసులు మంత్రి తుమ్మల పై ప్రశంసలు కురిపిస్తున్నారట.
ఖమ్మం నగరంలో గంజాయి డ్రగ్స్ మహమ్మారి లేకుండా ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల.ఖమ్మం అంటే అభివృద్ధిలో అగ్రగామిగా క్లీన్ గ్రీన్ సేఫ్ స్మార్ట్ సిటీ గా మార్చాలనే సంకల్పం తో ఉన్నారట మంత్రి తుమ్మల..
వాయిస్ 4…మారిన తుమ్మల తీరు…..
మంత్రి తుమ్మల వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే కాదు ఇతర పార్టీలోనూ ఆసక్తి కర చర్చ నడుస్తుంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గతానికి భిన్నంగా తుమ్మల తనదైన శైలిలో మారారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.
గతంలో కేవలం అభివృద్ధి పనులకే పరిమితమై అధికారులకు తప్ప నేతలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు అనే అపవాదు ఉండేది కానీ గతానికి భిన్నంగా తుమ్మల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా అభివృద్ధితో పాటు పార్టీ నేతలు కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టుగా సమయం దొరికినప్పుడల్లా పార్టీ కార్యకర్తల సమస్యలను ఓపిగ్గా వింటూ, పరామర్శలు చేస్తూ నిత్యం ప్రజలతో గడుపుతూ గతానికి భిన్నంగా తుమ్మల వ్యవహార శైలి మారిందని ఆయన అనుచరులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తన రాజకీయ జీవితంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఖమ్మంలో గత ప్రభుత్వంలో అరాచకం అవినీతి భూకబ్జాలు పెట్రేగిపోయాయని ప్రశాంతమైన ఖమ్మం కోసం.. ప్రగతి బాట పట్టే ఖమ్మం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలు నెరవేరుస్తుందని, ఇది ప్రజా ప్రభుత్వమని మేము పాలకులం కాదు సేవకులమని తుమ్మల తనదైన శైలిలో దూసుకుపోతున్నారట.
ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేస్తూ మంత్రి తుమ్మల దూసుకెళ్తుంటే బి.ఆర్.ఎస్ నేతలు ఎలాంటి హడావిడి లేకుండా కార్యక్రమాలు లేకుండా ఉన్నామా లేమా అన్నట్టుగా కారు పార్టీ నేతల కథ మారిందట.
భూకబ్జా కేసుల్లో వరుసగా
బీ ఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతుంటే 59 జీవో కింద మాజీ మంత్రి భూముల వ్యవహారం కూడా హైకోర్టులో జడ్జిమెంట్ దగ్గరగా ఉండడంతో ప్రతికూలంగా వస్తే ఏంటి పరిస్థితని గులాబీ పార్టీలో గుబులు రేపుతుందంట.. ఇదండీ ఖమ్మంలో అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతున్న మంత్రి తుమ్మల కథ..