విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం
- ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డి
- నగరంలో కేంద్రీయ విద్యాలయం, అంబేద్కర్ కళాశాల, గిరిజన హాస్టల్ తనిఖీ
- సమస్యలు పరిష్కరిస్తామని హామీ..
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం: తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ బిడ్డలు ఉన్నత స్థితికి చేరుకోవాలని.. చదివిస్తుంటారని అలాంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు.
సోమవారం ఆయన ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయం, ఎన్ఎస్పీ నగర్లోని అంబేద్కర్ కళాశాల, గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి విద్యార్థులతో ఆత్మీయంగా పలకరించారు. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు.
అక్కడి ప్రాంగణంలో మొక్క నాటారు. బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి సమావేశమై పలు అంశాలు చర్చించారు. నేటి విద్యార్థులే రేపటి భవిష్యత్తు అని.. బోధనలో రాజీ పడకుండా తీర్చిదిద్దాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు.
ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ఇబ్బంది రానీయకుండా.. పరిష్కరిస్తామని అభయమిచ్చారు. చక్కగా చదువుకోవాలని.. రేపటి ఉద్యోగులుగా నిలవాలని ఆకాంక్షించారు. నీటి, భవన సదుపాయ లోటుపాట్లు లేకుండా చూస్తామని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో..: కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మల యుగెందర్, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, నాయకులు కొప్పుల చంద్రశేఖర రావు, కూర్మా రావు, తిప్పి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు మహేష్, కాకి శ్రీను, నగేష్, ఆయా సంస్థల బోధనా, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.