NationalNotificationPolitical

తపాలా శాఖలో 44,228 కొలువులకు నోటిఫికేషన్‌..

తపాలా శాఖలో 44,228 కొలువులకు నోటిఫికేషన్‌..

తపాలా శాఖలో 44,228 కొలువులకు నోటిఫికేషన్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే

నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్ భారీ శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో ఎలాంటి పరీక్ష లేకుండానే దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 44,228 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలచేసింది.

జులై 15 నుంచి ఆగస్టు 5వరకు ఆన్‌లైన్‌లో https://indiapostgdsonline.gov.in/ దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. అలాగే ఆగస్టు 6 నుంచి 8వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది.

పదో తరగతి మార్కుల ఆధారంగా..
ఈ మేరకు పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా నియామకాలు చేపట్టనున్నట్టు అధికారులు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు

. బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (ABPM)/ డాక్‌సేవక్‌ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు.

మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం రావాలి. ఆ ఉద్యోగాలను బట్టి బీపీఎంకు వేతన శ్రేణి రూ.12 వేలు -రూ.29,380; ఏబీపీఎం/డాక్‌ సేవక్‌కు రూ.10వేలు -24,470గా నిర్ణయించారు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున గరిష్ఠ వయసులో సడలింపు ఉంది. ఏపీలో 1355, తెలంగాణలో 981 చొప్పున భర్తీ చేయనున్నారు. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.

పోస్టుల వివరాలు ఇవే..

  • బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)
  • అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)
  • డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి కింద తప్పనిసరిగా అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి, పోస్టులను కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button