కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావుకు ఆత్మీయ అభినందన సభ
సన్మానించిన మల్లయిగూడెం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రాయల నాగేశ్వరరావుకు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
కార్పొరేషన్ చైర్మన్ గా పదవి భాద్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం వచ్చిన రాయల కు మామిళ్లగూడెంలో ఉన్న వీవీసీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న మల్లయిగూడెం గ్రామ పంచాయతీ కార్యకర్తలు ఆయనకు శాలువా కప్పి సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా వారందరూ మాట్లాడుతు కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికీ గుర్తింపు తప్పకుండా వస్తుందని, కష్ట కాలంలో పార్టీలో ఉండి పోరాడిన రాయల నాగేశ్వరావు కు పదవి ఇచ్చిందని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం పట్టణ అధ్యక్షులు జావీద్, ఖమ్మం మేయర్ నీరజ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య, కాంగ్రెస్ నాయకులు సంభాని చంద్రశేఖర్, పోట్ల నాగేశ్వరావు, బాలసాని లక్ష్మినారాయణ, తుంబూరు దయాకర్ రెడ్డి, మురళి, వెంకటేశ్వరరావు, ధర్మారవు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బొందయ్య, ఓబీసీ జిల్లా ఉపాద్యక్షులు వేణు, ఓబీసీ పట్టణ అధ్యక్షులు జయప్రకాష్, బాదవత్ రవి, బాదవత్ వెంకన్న, దాసరి గోపి, భూక్య ఉపేందర్, జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.