పాలేరు నియోజవర్గంలో దయాకర్ రెడ్డి పర్యటన
- పైనంపల్లి, జక్కేపల్లిలో నూతన చెక్ డ్యాంల నిర్మాణానికి స్థల పరిశీలన
- కూసుమంచి మండలంలో పలు కుటుంబాలకు పరామర్శ
- పెద్దతండా గ్రామంలో ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాల సందర్శన
సికె న్యూస్ ప్రతినిధి
నేలకొండపల్లి / కూసుమంచి/ఖమ్మం రూరల్ : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి, కూసుమంచి , ఖమ్మం రూరల్ మండలాల్లో బుధవారం పర్యటించారు.
పర్యటనలో భాగంగా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం లో ఉన్న చెక్ డ్యాం ఎత్తు పెంచే అంశంతో పాటు రామచంద్రాపురం, పైనంపల్లి గ్రామాల మధ్య నూతన చెక్ డ్యాం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. అనంతరం కూసుమంచి మండలం జక్కేపల్లి లో కూడా నూతన చెక్ డ్యాం ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.
అలాగే ఈశ్వరమదారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ సూర్యనారాయణ రెడ్డి తండ్రి చనిపోగా దశదిన కర్మకు, జ్జుజ్జులరావు పేట లో కాంగ్రెస్ నాయకులు శేఖర్ రెడ్డి తల్లి చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. చిత్రపటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు.
ఖమ్మం రూరల్ మండలంలోని పెద్ద తండా గ్రామంలో ఉన్న ప్రభుత్వ మహిళా నర్సింగ్ కళాశాల ను సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి వారి సమస్యలను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
నేలకొండపల్లి మండల నాయకులు నెల్లూరి భద్రయ్య, శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, కూసుమంచి మండల అధ్యక్షుడు మట్టే గురవయ్య, ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, మంకెన వాసు, పెండ్ర అంజయ్య, జూకూరి గోపాల్ రావు, జొన్నలగడ్డ రవి,హఫీజుద్దీన్ రమేష్ రెడ్డి, జీవన్ రెడ్డి, యడవల్లి రామి రెడ్డి, చాట్ల పరుశురాం, వినోద, బాసు, మంచా నాయక్ తదితరులు పాల్గొన్నారు.