Uncategorized

ఆర్. నారాయణ మూర్తికి అస్వస్థత..

ఆర్. నారాయణ మూర్తికి అస్వస్థత..

ఆర్. నారాయణ మూర్తికి అస్వస్థత.. నిమ్స్ లో చికిత్స

హైదరాబాద్ : ప్రముఖ నటుడు, సామాజిక వేత్త ఆర్.నారాయణమూర్తి అస్వస్థతకు గురయ్యారు. 2024, జూలై 17వ తేదీ ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ కోసం వెళ్లారు.

అక్కడికి వెళ్లిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడలేక పోయారు.నీరసంగా ఉందని.. కళ్లు తిరుగుతున్నట్లు చెప్పారు నారాయణమూర్తి. దీంతో ఆయన పక్కనే ఉన్న సినిమా వాళ్లు.. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

నిమ్స్ ఆస్పత్రిలో ఆర్.నారాయణమూర్తికి డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం నారాయణమూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు..

రెండు నెలల క్రితమే ఆర్.నారాయణ మూర్తికి బైపాస్ సర్జరీ జరిగింది. గుండె నాళాల్లో బ్లాకులు ఉండటంతో.. బైపాస్ సర్జరీ చేశారు డాక్టర్లు. అప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు.

ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఉండటంతో రావటం.. అక్కడ అస్వస్థతకు గురవటంతో నిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేస్తున్నారు డాక్టర్లు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button