రెండో విడత రుణమాఫీపై కీలక అప్డేట్….
తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతులకు రుణమాఫీని పక్కగా అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మొదటి విడతలో లక్షరూపాయల వరకు రుణం తీసుకున్న రైతులకు మాఫీ చేసింది.
ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా రెండలక్షల వరకు రుణమాఫీ చేయలేదు.ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ జులై 18న ప్రారంభించింది.
విడతల వారీగా రుణమాఫీ అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తొలి విడతలో లక్షరూపాయలు తీసుకున్న రైతులకు మాఫీ చేస్తింది. అర్హులైన 11లక్షల 50వేల మంది రైతులకు రూ. 6098కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది సర్కార్.
దీంతో రాష్ట్రంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల ముఖ్యమంత్రి చిత్రపటానికి పూలమాల వేసి పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెండో విడత రుణమాపీపై తాజాగా మరో కీలక అప్ డేట్ బయటకు వచ్చింది.
ఈనెల 31న రెండో విడత నిధులను విడుదల చేయడానికి సర్కార్ సిద్ధమయ్యింది. ఈ విడతలో లక్షన్నర వరకు రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ చేస్తారట. దీనికి సంబంధించిన ప్రభుత్వానికి 7వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు.
ఇక మిగిలిన 2లక్షల వరకు ఉన్నరుణాన్ని ఆగస్టు 15వ తేదీ లోపు పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. రుణమాఫీపై రైతులకు ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దని..రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
లబ్దిదారుల జాబితాలో పేర్లు ఉన్న కొంతమంది రైతులకు సాయం అందించడంతో ప్రభుత్వం సాయంత్రానికి మెజార్టీ రైతులకు సొమ్మును వారి ఖాతాలో జమచేసింది.
వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు, ఫోన్స్ కాల్స్ వస్తున్నా రైతు సందేహాలను నివ్రుత్తి చేయలేకపోతున్నారు. రేషన్ కార్డు ఉన్నా చాలా మంది రైతులు రుణమాఫీ ప్రయజనం పొందలేకపోయారని రైతులు చెబుతున్నారు.
సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్ జిల్లాల యంత్రాంగం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి రైతులు తమ వ్యవసాయ అధికారులు లేదా మండల వ్యవసాయ అధికారులు లేదా జిల్లా వ్యవసాయ అధికారుల ద్వారా ఫిర్యాదులు, వివరణలు పొందాలని సూచించారు.
వ్యవసాయ అధికారులు లబ్దిదారుల డేటాలోకి లాగిన్ ఇచ్చారు కాబట్టి ఏఈవోలు వారి స్థితిని తెలుసుకునేందుకు డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. రైతులు పెద్దెత్తున బ్యాంకుల దగ్గరకు చేరుకోవడంతో జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు రద్దీగా మారాయి.
అయితే వ్యవసాయ అధికారులు మాత్రం అర్హులైన రైతులందరికీ రుణమాఫీచేస్తామని చెప్పారు. అయితే రుణమాఫీలో మీరు అర్హులుగా ఉన్నారా లేదా అనే వివరాలను https://clw.telangana.gov.in/Login.aspx వెబ్ సైట్లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.