ప్రజావాణిలో మహిళల ఆత్మహత్యయత్నం?
సూర్యాపేట : వంశ పర్యపారంగా వచ్చిన తమ భూమిని ఇతరులు కబ్జా చేశారని,దీనిపై రెవిన్యూ కార్యాలయం చుట్టూ గత కొన్నేళ్లుగా తిరుగుచున్నపటికి తమకి న్యాయం జరగడం లేదని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామనికి చెందిన ఎస్టి మహిళ మేడం అరుణ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని తమ గోడును వెళ్లబోసు కున్నారు.
కలెక్టరేట్ లో ప్రతి సోమ వారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనేం దుకు వచ్చిన వారు కలెక్టర్ కీ పిర్యాదు చేయడానికి ముందే తమ వెంట తెచ్చు కున్న పెట్రోల్ ని ముగ్గు రు.మహిళలు పోసుకునే క్రమంలో అక్కడున్న పోలీసులు సిబ్బంది చూసి వారిని అడ్డుకున్నారు.
వారి తాతల పేరున మొత్తం 10 ఎకరాల భూమి ఉంద ని,అందులో 2 ఎకరాల 50 సెంట్ల భూమి ఉందని, సర్వే నంబర్ 190/24 లో పహానీ ఉండగా అది కూడా మా పక్కనే ఉన్న భూతరాజు రామారావు, భూతరాజు రాజీమా భూమిని కబ్జా చేశారు. అని వాపోయారు.
వారి పేరుమీద ఉన్న భూమిని నడిగూడెం ఎం.ఆర్.వో నరసింహారావు వారికి దొంగ పట్టా చేసి పాస్ బుక్ ఇచ్చారని అన్నారు. మా పేరుమీద ఉన్నప్పుడు ఇలా దొంగపట్టాలు ఏ రకంగా ఎం.ఆర్.వో చేస్తాడు అని ఆవేదన వ్యక్తం చేశారు.
మా భమి మీరు ఎలా పట్టా చేసుకుంటారని అడిగితే ఎం.ఆర్.ఓ నర్సింహరావు చేశారు అని భూతరాజు రామారావు చెప్పారు అన్నారు.తామూ పొట్టకూటి కోసం ఊరు వదిలి వెళ్లి వచ్చే సరికి తమ భూమి లేదని కన్నీరు మున్నీర య్యారు.
దీనిపై గతంలో స్థానిక ఎమ్మార్వోనీ కలిసినప్పటి ఫలితం లేకపోయిందని ఆరోపించారు.ఇదిలా ఉండగా సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన అవుట నాగయ్య అనే రైతు గత కొన్నేళ్ల క్రితం ఓ వ్యక్తి నా భూమిని బలవంతంగా లాక్కొని సర్వే నంబర్ 836 లో గల 2 ఎకరాల 11 గంటల నా భూమిలో బోర్డు పెట్టు నన్ను రానివ్వడం లేదని వాపోతూ తన వెంట తెచ్చుకున్న మందు డబ్బాను తీయబోతుండగా పోలీసులు అడ్డుకున్నారు.
మాకు మా భూమి కావాలి. మా బతుకుదెరువు మా భూమే అని మా భూమిని మాకు ఇప్పించి పాసుబు కలు ఇప్పించాలని కోరా రు.ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు ఇప్పించక పోతే మాకు చావే శరణ్యం అని అన్నారు.
ఎన్నిరోజులు ఇలా దేశాలు పట్టుకొని తిరగాలి మేము భూమి చేసుకొని బతుకు తం ఇక తిరిగి తిరిగి ఇసుగొ చ్చింది, మాకు న్యాయం చేయకపోతే మేము కలెక్టరేట్ కార్యాలయం ముందే చచ్చిపోతాం మాపై దయదలచి మా భూమిని మాకు ఇప్పించాలని కలెక్టర్ ని వేడుకున్నారు.