ఐఐటీకి వెళ్లలేక.. మేకలకాపరిగా
రూ. 3లక్షల కోసం గిరిజన విద్యార్థిని ఎదురుచూపు
వీర్నపల్లి (సిరిసిల్ల): ఐఐటీలో చదవాలన్న ఆశ ఉన్నా.. ఆర్థికపరిస్థితి బాగాలేదు. ఎంతో కష్టపడి జేఈఈ మెయిన్ లో ప్రతిభ చాటి మంచి ర్యాంకు సాధించినా, కాలేజీ ఫీజుచెల్లించలేని దుస్థితిలో మేకల కాపరిగా మారింది.
విద్యాభిమానులు, దాతల సహకారం కోసం ఆ విద్యార్థిని ఎదురు చూస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ రాములు-సరోజ దంపతులకు ముగ్గురు కూతుళ్లు.
ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో సాయ పడుతున్నారు. మూడో కూతురు మధులత జేఈఈ మెయిన్ లో ప్రతిభ కనబరిచి ఎస్టీ కేటగిరీలో 824వ ర్యాంక్ సాధించింది. పాట్నా ఐఐటీలో సీటు వచ్చింది.
అయితే రూ.3లక్షల ఫీజు చెల్లించలేని స్థితిలో మేకల వద్దకు వెళుతోంది. ఈనెల 27వ తేదీలోపు ఈ ఫీజు చెల్లించాల్సి ఉంది. దాతలు సాయం చేస్తే గిరిజన బిడ్డకు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం దక్కుతుంది.భూక్యా లింగంనాయక్ 99494 15677, బదావత్ శిరీష్ 72074 61506, గుగులోత్ రవిలాల్నాయక్ 9440970154