ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు
*సెల్యులైటీస్ అనే వ్యాధితో మంచానికి పరిమితం.
*వైద్యానికి ఇంకా ఆరు లక్షల పైగా ఖర్చు.
*దాతలు ఆదుకోవాలంటూ వేడుకోలు.
సీకే న్యూస్ వేములపల్లి జులై 23
రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబంలో మాయదారి వింత రోగం కష్టాలు తెచ్చిపెట్టింది. వివరాల్లోకి వెళ్తే వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన భారీ శివలింగం యాదవ్ ముత్తమ్మ దంపతులకు ముగ్గురు సంతానం.
2023 సంవత్సరంలో విరి పెద్ద కుమారుడు భారీ వెంకన్న యాదవ్ మూర్ఛవ్యాధితో పొలంలో పడి మరణించారు. అదే సంవత్సరం చివరి నెలలో రెండవ కుమారుడు జగన్ యాదవ్ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు. మూడవ కుమారుడు దివ్యాంగుడు అయిన నాగరాజు తల్లిదండ్రులను పోషిస్తున్నారు.
ఇద్దరు కుమారులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న శివలింగానికి వింత రోగం వెంటాడుతుంది. గత కొన్ని వారాలుగా సెల్యూలైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి రావడంతో కణజాల వ్యవస్థలో రక్త ప్రసరణ ఆగిపోయి కుడి కాలికి గాయాలు అయ్యాయి.
ఈ వ్యాధితో కాలు తీసేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధి పదివేల మందిలో ఒకరికి మాత్రమే వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అనారోగ్యంతో ఉన్న అతన్ని మిర్యాలగూడ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా 55వేల రూపాయలు ఖర్చు అయ్యాయి.
డాక్టర్ల సూచన మేరకు చికిత్స నిమిత్తం హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇందుకు ఒక నెలరోజుల వ్యవధిలో ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయినా కూడా వ్యాధి తగ్గలేదు. ఇంకా 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని వైద్యులు సూచించారు.
దీంతో నిరుపేదలైన ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూలి పనులకు వెళ్తే గాని కుటుంబ పోషణ గడవని పరిస్థితుల్లో అంత డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దాతలు పాలకులు సహాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
నా భర్తను కాపాడండి.
గత కొన్ని వారాలుగా సెల్యులైటిస్ అనే వ్యాధితో నా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటివరకు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశాం.
ఇంకా 7 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు సూచించారు. మాకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు కుమారులు చనిపోయారు. మూడవ కుమారుడైన నాగరాజు దివ్యాంగుడు. చేతిలో చిల్లిగవ్వలేదు. దాతలు పాలకులు స్పందించి ఆదుకోవాలి. నా భర్తకు ప్రాణం పోయాలి.
భారీ ముత్తమ్మ, శివలింగం భార్య
దాతలు సాయం చేయాల్సిన నెంబర్లు
భారీ నాగరాజు.
ఫోన్ పే. గూగుల్ పే నెంబర్ 9000033557.
బ్యాంక్ అకౌంట్ నెంబర్: 62315789972.
ఐఎఫ్ఎస్సి కోడ్: ఎస్బిఐఎన్ 0020322.
ఎస్బిఐ (ఎడిబి) మిర్యాలగూడ బ్రాంచ్.