ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లింది: మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ : జులై 25
ఇవాళ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు.
అసెంబ్లీ వాయిదా అనంతరం కేసీఆర్ మీడియా పాయింట్ వద్ద బడ్జెట్ పై మాట్లాడుతూ.. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉందన్నారు. బట్టి విక్రమార్క బడ్జెట్ ను నొక్కి చెప్పడం తప్ప ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద మాకు పూర్తి స్థాయి అవగాహన ఉందన్నారు. ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని,బడ్జెట్ లో కొత్తేమీ లేదని తెలిపారు.
ఏ సంక్షేమ పథకం ఇందులో లేదని కేసీఆర్ అన్నారు. ఒత్తి ఒత్తి పలకడం తప్ప ఇందులో ఏమి కనిపించలేదని అన్నారు. ఆరు మాసాలు సమయం ఇవ్వాలని నేను ఇన్నాళ్లు రాలేద న్నారు.
పాలసి ఫార్ములా లేదన్నారు. రెండు పంటలకు రైతు బంధు ఇచ్చామని తెలిపారు. రైతు బంధు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతు శత్రు ప్రభుత్వంగా మారింది కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంత గ్యాస్ తప్ప ఏమి లేదన్నారు. ఐటీ పలసీ ఏమి లేదని తెలిపారు. ట్రాష్ ప్రసంగం లాగానే ఉందన్నారు. పేద ప్రజల పాలసి లేదని తెలిపారు.
వ్యవసాయ స్థిరీకరణ లేదని తెలిపారు. స్టోరీ టెల్లింగ్ లాగానే బడ్జెట్ ప్రసంగం మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఒక్క పాలసీ మీదా కూడా నిర్దిష్టంగా లేదన్నారు. పద్దతి లేదు ఈ బడ్జెట్ లో ఈ బడ్జెట్ పై చీల్చి చెందాడుతామన్నారు.