గంజాయి మత్తులో ఎల్‌ఎల్‌బి విద్యార్థినిపై అత్యాచారం
అత్యాచారాన్ని వీడియో తీసిన ఉత్తమ భార్య
తిరుపతి జిల్లా : స్నేహితురాలైన విద్యార్థినిపై భర్తతో అత్యాచారం చేయించి అనంతరం భార్య వీడియోలు తీసి ఆమెను వేధించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బి చదువుతోంది. అక్కడే ప్రణవ కృష్ణ అనే మహిళకు పరిచయమైంది. ఆ యువతి,ప్రణవ కృష్ణ అనే మహిళ తన భర్త కృష్ణకిషోర్ రెడ్డితో కలిసి తిరుపతిలో ఉంటున్నారు.
ప్రణవ కృష్ణ, కృష్ణకిషోర్ రెడ్డి అనే దంపతులు గంజాయికి బానిసగా మారారు. యువతి పలుమార్లు ప్రణవ కృష్ణ ఇంటికి వచ్చి వెళ్లేది. అ సమయంలో యువతికి గంజాయిని అలవాటు చేశారు. ఒక రోజు యువతి గంజాయి మత్తులో ఉండగా ఆమెపై భర్త అత్యాచారం చేస్తుండగా భార్య వీడియోలు తీసింది.
ఈ వీడియోలతో యువతిని బెదిరించి బంగారు, నగలు తీసుకున్నారు. యువతి వీడియోలు ఆమె కుటుంబం సభ్యులతో పాటు కాబోయే భర్తకు పంపించి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు గురువారం తిరుపతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.