బి.ఆర్.ఎస్ పదేళ్ల చరిత్రలో లేని కరెంటు కొరత” కాంగ్రెస్ పార్టీకే ఆ ఘనత.!
“కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరిన హరీష్ రావు”
“గుప్పెట్లో గూడెం ప్రజల ప్రాణాలు”
“6 గ్యారంటీలు ఎలాగ ఉన్నాయంటే”అరచేతిలో పోసి మోచేతిదాకా…….చే సామెతకు నిలువెత్తు నిదర్శనమే ఆ ప్రభుత్వం ముచ్చట”
“బస్సు ఫ్రీ ఏ కానీ’ ప్రయాణమే ప్రమాదకరం.!”
“కరెంటు ఉచితమే.! కానీ కరెంటు వచ్చినప్పుడు”
“అసలే వరదలు విష కీటకాలతో భయభ్రాంతికి గురవుతున్న ప్రజలకు కరెంటు కొరత తలకి మించిన భారం అవుతుంది”
“ములుగు జిల్లా సికే న్యూస్ ప్రతినిధి భార్గవ్”
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తెలంగాణను సాధించిన తర్వాత తెలంగాణలోని ముఖ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం తప్పనిసరి అని భావించిన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం మహోన్నతమైన పథకాలతో ప్రజా సమస్యలకు పరిష్కారం వెతుకుతూ అనునిత్యం ప్రజల సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చిస్తూ సకాలంలో స్పందించే ఆనాటి ప్రభుత్వంపై ఈనాడు తెలంగాణలో అధికారాన్ని అధిష్టించిన అధికార ప్రభుత్వం చెప్పే కల్లబొల్లి మాటలకు చెక్ పెట్టిన బి.ఆర్.ఎస్ నాయకుడు అసెంబ్లీలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు ముక్కు మీద వేలు వేసుకునేలా చాలెంజ్ చేశారు.
అసెంబ్లీలో నా మీద నువ్వు నీ మీద నేను అసెంబ్లీ అధ్యక్షులకి చెప్పడం కాదు, ఇద్దరం కలిసి అసెంబ్లీ గేటు ముందుకి వెళ్దాం.! ప్రజలే చెప్తారు మీ ఎనిమిది నెలల పరిపాలనలో ప్రజలు ఏమి పొందారో, ఏమి కోల్పోయారో, ప్రజలే నిర్ణయిస్తారు. అని తగేసి చెప్పిన బి.ఆర్.ఎస్ నాయకుడు హరీష్ రావు.
అంతేకాకుండా కరెంటు కొరత విషయమై ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని విద్యుత్ శాఖ అధికారులను పాత్రికేయులు ప్రశ్నించగా. విద్యుత్ శాఖ సిబ్బంది వెల్లడి చేసిన సమస్య మరింత బాధాకరం. ఇతర సబ్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బంది సంఖ్య వేరు.
వెంకటాపురం మండలంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ సిబ్బంది సంఖ్య వేరు వెంకటాపురం మండలంలో ప్రజలకు విద్యుత్ సరఫరా అందించే క్రమంలో జరుగుతున్నటువంటి తప్పిదాలకు సిబ్బంది సంఖ్య తక్కువ ఉండడమే కారణం అంటున్న విద్యుత్ శాఖ ఉన్నతాధికారి మాట తీరు.
ఇదిలా ఉండగా ములుగు జిల్లా గోదావరి ముప్పు ప్రాంతాలలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చడంతో వరద లోతట్టు ప్రాంతాలలో. గూడెం ప్రజలు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అధికారుల వైపు ఆశగా ఎదురుచూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.