తెలంగాణలో కోవిడ్ మరణం.. స్పందించిన వైద్యారోగ్యశాఖ మంత్రి
హైదరాబాద్..
తెలంగాణలో కరోనా మరణంపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఎవరూ మరణించలేదని తెలిపారు. కోవిడ్ మరణం నమోదు అంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వెల్లడించారు.
ఉస్మానియాలో చనిపోయిన వ్యక్తికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు. కోవిడ్ మరణం అనే అంశంపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆరా తీసిన మంత్రి.. మహమ్మారి పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సాయంత్రం ఐదు గంటలకు మంత్రి సమీక్ష చేయనున్నారు. పూర్తిస్థాయి కరోనా వివరాలతో రావాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు..
ఇదిలా ఉండగా ఉస్మానియా ఆసుపత్రిలో కోవిడ్‌తో ఇద్దరురోగులు ప్రాణాలు విడిచినట్లు వార్తలు వచ్చాయి. మరో ఇద్దరు జూనియర్ డాక్టర్‌లకు సైతం పాజిటివ్‌గా తేలింది.
అనారోగ్య సంబంధిత వ్యాధిలతో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో చేరగా.. సమస్య తీవ్రం కావడంతో ఇద్దరురోగులు మరణించారు.
మృతులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించిన్లు సమాచారం..