HyderabadPoliticalTelangana

కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!

కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!

కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం!

కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం!

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది.

కాసేపు మంత్రులు వర్సెస్ కేటీఆర్‌గా పరిస్థితులు నడవగా.. మరికొద్దిసేపు సీఎం రేవంత్ రెడ్డి-కేటీఆర్‌ల మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో ఒకింత ఆగ్రహానికి లోనైన ముఖ్యమంత్రి.. కేటీఆర్ రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి అని హెచ్చరించారు!

అసలేం జరిగింది..?

‘ఫార్మా సిటీ భూములు వెనక్కి ఇస్తామని హామీ ఇచ్చారు.. చేయండి. మూసీని లండన్ చేస్తాం అంటున్నారు.. చేయండి. మూసీ సుందరీకరణను స్వాగతిస్తున్నాము. రూ.16వేల కోట్లతో మేము ప్రతిపాదనలు సిద్దం చేశాం. కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఎందుకు ప్రతిపాదన పెరిగిందో డీపీఆర్ సబ్మిట్ చేయాలి..?’ అని అసెంబ్లీ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మాట్లాడిన ప్రతి విషయంపైనా సీఎం రేవంత్ రెడ్డి ఓ రేంజిలో స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు.

కుట్ర ఏంటి..?

‘ కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మోసం అనే ప్రణాళికలు అమలు చేస్తున్నారు. పదేళ్లు ఏలిన మీరు పది నెలలు నిండని ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.

బతుకమ్మ పథకాన్ని ప్రారంభించిన ఏడాది సిరిసిల్లలో నేతన్నలు ఆ చీరలు నేశారా?. మీ బినామీలకు కాంట్రాక్టు ఇచ్చి సూరత్ నుంచి తూకంలో తెచ్చారా?. కమిషన్లు కొట్టి పేదలను మోసం చేశారా.. లేదా?. ఎంఎంటీస్‌ను ఎయిర్ పోర్ట్‌లోనికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు..?

దీని వెనుక ఉన్న కుట్ర ఏంటి?. ముచ్చర్ల భూ సేకరణపై వారే ఊహించుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా మారుస్తానని మీలా నేనెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధిస్తూ కన్నెర్రజేశారు.

కేటీఆర్ సవాల్..

కాగా.. అంతకుముందు కేటీఆర్ వర్సెస్ మంత్రుల మధ్య మాటల యుద్ధం సాగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో కోతలు, ఎగవేతలతో మసిబూసి మారేడుకాయ చేశారు. రైతు భరోసాకు బడ్జెట్ ఏదని ప్రశ్నించారు.

పెన్షన్ డబుల్ చేసే కేటాయింపులు ఎక్కడని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు ఎన్నికల ముందు రజినీకాంత్, తర్వాత గజినీకాంత్‌లా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటాల గడ్డ.. మభ్యపెడితే ఊరుకోదని కేటీఆర్ అన్నారు. చార్జిషీట్లు, రికవరీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కకు కేటీఆర్ సవాల్ ఒకటి విసిరారు.

అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీకి వెళదామని.. ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చినట్లు యువకులు చెబితే అక్కడే రాజీనామా చేయడమే కాదు.. రాజకీయ సన్యాసం చేస్తానంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. పైగా రేవంత్, భట్టికి పౌర సన్మానం కూడా చేస్తామని తెలిపారు.

కౌంటర్లే కౌంటర్లు!

ఈ క్రమంలోనే మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు ఒక్కొకటి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. మేము చేయకపోతే ప్రజలే మాకు బుద్ది చెబుతారన్నారు. కొంచెం ఓపికగా ఉండాలని తెలిపారు.

దీనికి తిరిగి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఓపికగా ఉండాల్సింది మంత్రులు అని.. తాము కాదని కేటీఆర్ పేర్కొన్నారు. వంద రోజులలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ఎవరు చెప్పమన్నారని ప్రశ్నించారు. పోస్టులు పెంచమంటే పోలీసులతో దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు.

సన్నాసులు గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారని సీఎం రేవంత్ అవమానిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. జీవో 46సవరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు.

కేటీఆర్ సత్యదూరంగా మాట్లాడుతున్నారని.. బీఆర్ఎస్ కూడా మాకు పోటీగా హామీలు ఇచ్చిందన్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మలేదన్నారు. కాంగ్రెస్ తోనే మార్పు సాధ్యం అని ప్రజలు నమ్మారన్నారు. మమ్మల్ని గెలిపించారని.. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు.

దళితుడిని సీఎం చేస్తామని చెప్పి ఆ హామీని తుంగలో తొక్కారన్నారు. వారికి సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు ఉందా? అని శ్రీధర్ బాబు ప్రశ్నించారు. మొదటి బడ్జెట్‌కే ఇంత భయపడితే.. మరో నాలుగు బడ్జెట్‌లు ప్రవేశ పెడితే ఎంత భయపడతారని శ్రీధర్ బాబు ప్రశ్నించారు..

బతుకమ్మ చీరల పథకంలో అవినీతే..
హైదరాబాద్: సభను తప్పుదోవ పట్టించటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో జొప్పిస్తున్నారన్నారు. పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయని.. ప్రజల అనుభవాలు వారికి ఉన్నాయన్నారు. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారన్నారు.

పదేళ్ల పాలన చేసిన వారు పది నెలలు పూర్తి చేసుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగిందన్నారు. నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బతుకమ్మ చీరల కాంట్రాక్ట్‌ బినామీలకు అప్పగించారని.. సూరత్‌ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్‌ కొట్టేశారని రేవంత్ ఆరోపించారు. ఎంఎంటీఎస్‌ను విమానాశ్రయం వరకూ వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

దీని వెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలన్నారు. మేమెప్పుడు మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్‌ చేస్తామని చెప్పలేదన్నారు. హుస్సేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదని రేవంత్ ఎద్దేవా చేశారు.

స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని.. టూరిజం హబ్‌ క్రియేట్‌ చేస్తామంటున్నామని తెలిపారు. ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్‌ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏషియన్‌ గేమ్స్‌ నిర్వహించిన హైదరాబాద్‌లో.. స్టేడియమ్స్‌ అన్నీ తాగుబోతుల అడ్డాగా మారాయని రేవంత్ పేర్కొన్నారు.

ఒలింపిక్స్‌లో కాంస్యం వస్తేనే వందకోట్ల మంది సంబరపడే పరిస్థితి నెలకొందన్నారు. నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం ఇస్తామని చెప్పి మీరు ఇవ్వలేదని రేవంత్ అన్నారు. మహ్మద్‌ సిరాజ్‌కు గ్రూప్‌1 ఉద్యోగం ఇస్తున్నామన్నారు. ఫార్మాసిటీ అని వాళ్లన్నారని.. మేం ఫార్మా విలేజ్‌లు అంటున్నామన్నారు.

వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీలు పెడితే ఆ ప్రాంతమంతా కలుషితమవుతుందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేటీఆర్‌ 100 శాతం ఆర్టిఫీషియల్‌, సున్నా శాతం ఇంటెలిజెన్స్‌ అన్నారు. ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని రేవంత్ అన్నారు.

ముచ్చర్లలో నాలుగో నగరాన్ని నిర్మిస్తున్నామని.. మన భవిష్యత్‌ నగరంగా ముచ్చర్ల కాబోతుందని.. మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలైపోయాయని.. ప్రతిపక్షంగా మీ పాత్ర పోషించాలని హితవు పలికారు. కేసీఆర్‌ చీల్చి చెండాడుతా అంటే బుల్లెట్‌ ఫ్రూఫ్‌ జాకెట్‌ వేసుకొని వచ్చానన్నారు. అగ్రికల్చర్‌, ఇండస్ట్రీ, ఐటీ, ఎక్సైజ్‌ పాలసీలు తీసుకొస్తామని రేవంత్ పేర్కొన్నారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!