నిర్దోషులమైనా మాకు ఉద్యోగాలు ఇవ్వరా..? కానిస్టేబుల్ అభ్యర్థుల ఆవేదన..!
Web desc : హైదరాబాద్ : ప్రజా భవన్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఉన్న సీఎం ఈ రాష్ట్రాన్ని పరిపాలించొచ్చు..కానీ నిర్దోషులమైనా మాకు ఉద్యోగాలు ఇవ్వరా..? అని ఓ అభ్యర్థి కన్నీరు పెట్టుకున్నారు.
2022 ఏడాదిలో జారీ చేసిన పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన తర్వాత కూడా తమను ట్రైనింగ్‌కు పంపించడం లేదంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఓ అభ్యర్థి మాట్లాడుతూ.. 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు సెలెక్ట్ అయ్యి మెడికల్ టెస్టుల్లో కూడా క్వాలిఫై అయ్యాము. డ్రెస్ కొలతలు కూడా తీసుకున్నారు.. కానీ రేపు ట్రైనింగ్ అనంగా ముందు రోజు మమల్ని ఆపేసారు.
కారణం ఏంటి అని అడిగితే మా మీద కేసులు ఉన్నాయని చెప్పారు. మా కేసులు కూడా క్లియర్ అయ్యాయి.. అయినా ఎందుకు ఆపేసారు అంటూ అప్పటి నుండి సీఎం కోసం మినిస్టర్స్ కోసం తిరుగుతూనే ఉన్నాము.
మాకు ఎటువంటి సమాధానం లేదు కనీసం సీఎంను కలవనివ్వట్లేదు. ప్రతి మంగళవారం, శుక్రవారం వస్తూనే ఉన్నాము మాకు సీఎం అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరో కానిస్టేబుల్ అభ్యర్థి మాట్లాడుతూ.. ఇది ప్రజా పాలన కాదు.. దగా పాలన.. సీఎం మీద కేసుల్లేవా..? ఆయన మీద కేసులున్నా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు.. కానీ మా మీద కేసులుంటే ఇలా రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది.
మా మీద ఉన్న కేసుల్లో మమ్మల్ని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. అయినా కూడా మాకు న్యాయం జరగడం లేదు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణికి వస్తున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. చాలా బాధ అనిపిస్తుంది..
లైఫ్ ఏంటో అర్థం కావడం లేదు. కుటుంబ సభ్యులకు ముఖం చూపించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రజావాణికి వచ్చినప్పుడల్లా వెయ్యి రూపాయాలు అయిపోతున్నాయి. మంత్రులందరూ పవర్ లేని మంత్రులే. మంత్రుల వల్ల ఏం లాభం లేదు.
ట్రైనింగ్‌కు వెళ్లేందుకు ఆగస్టు 6 వరకు మాత్రమే అవకాశం ఉంది. అప్పటివరకు న్యాయం జరగకపోతే మళ్లీ నాలుగు సంవత్సరాలు వేచి చూడాలి. మేం ఆ సమయానికి ఎలా ఉంటామో తెలియదు. అప్పుడు నువ్వు ఇచ్చిన ఒక్కటే ఇవ్వకపోయినా ఒక్కటే అని ఆ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.