ఏసీబీ వలలో తహశీల్దార్….
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం తహసీల్దార్ జాహిద్ పాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓదెల మండలం కొమురే గ్రామానికి చెందిన రైతు కాడాం తిరుపతి తండ్రి మల్లయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మంద మర్రిలో నివాసం ఉంటున్నాడు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 645,0.28 లో భూమి కలదు. ఈ భూమి పట్టా కొరకు తహసీల్దార్ జాహిద్ పాషా ను పలు మార్లు కలిశాడు. భూమి పట్టా చేయడానికి ముందుగా 50 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. దాంతో మూడు విడతల్లో
15 వేలు, 20 వేలు,15 వేలు ముట్టజెప్పాడు. అయినా కూడా భూమి పట్టా కాకపోవడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రజా వాణి లో దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో భూమి ధరణిలో ఆన్లైన్ లో పేరు నమోదు అయ్యి పట్టా పాస్ పుస్తకం వచ్చింది.
విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఆ రైతుకు ఫోన్ చేసి భూమి పట్టా అయ్యిందని, మళ్లీ 10 వేలు ఇవ్వాలని రైతుపై ఒత్తిడి చేశాడు. 10 వేల రూపాయలను తమ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేయాలని రైతుతో చెప్పాడు.
దీంతో ఏమి చేయలేక రైతు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా సమాచారంతో తహసీల్దార్ జాహిద్ పాషాను ఏసీబీ అధికారులు డీఎస్పీ రమణ మూర్తి, సీఐ కృష్ణ కుమార్ పట్టుకొని విచారిస్తున్నట్టు సమాచారం.