గంజాయి కేసులో ఇద్దరికీ కఠిన కారగారి శిక్ష…
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 06,
గంజాయి కేసులో ఇద్దరికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్ఎసి – మొదటి అదనపు జిల్లా జడ్జి, ఎన్ డి పి ఎస్ స్పెషల్ జడ్జ్ ) పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు.
కేసు వివరాలు ఇలా…అప్పటి సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్రీకాంత్ తన డ్యూటీలో భాగంగా కూనవరం రోడ్డు సిఆర్పి క్యాంపు భద్రాచలం టౌన్ లో 29 మే 2003న ఉదయం ఏడు గంటలకు వాహన తనిఖీ చేస్తుండగా
ఓ డి -30- ఈ -6570 ట్రాక్టర్ ఫై ఒరిస్సా కు చెందిన మల్కనగిరి జిల్లా చిత్రకొండ పి. ఎస్. ట్రాక్టర్ డ్రైవర్ రఘునాథ్ ధనంజయత్ మరియు రబీoద్ర కార ట్రాక్టర్లో 485 కేజీల గంజాయి ప్యాకెట్స్ తో,కారు నెంబర్ ఓ డీ -30- ఈ -4097 కారులో పైలెట్గా కౌసల్య అర్జున్ సింగ్, కౌశల్య నందిని వస్తున్నారు. వారిని ఆపి పరిశీలించగా 485 కేజీలు గల 97 ప్యాకెట్స్ గంజాయి ట్రాక్టర్ లో పట్టుబడినది. వెంటనే పంచనామా చేసి పిఎస్ లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసుకున్నారు.
పైలెట్ కారులో వచ్చిన ఇద్దరూ పారిపోయారు దర్యాప్తులో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. నాగరాజు దర్యాప్తు అనంతరం కోర్టులో రఘునాథ్ ధన్యాయత్ రబీoద్ర కారా లపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. మిగతా ఇద్దరు దొరకగానే సప్లమెంటరీ ఛార్జ్షీట్ ద్వారా వారిని కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.
కోర్టులో ముగ్గురి సాక్షులను విచారించిన అనంతరము కేసు పూర్వాపరాలు పరిశీలించి ఇద్దరి పై నేరం ఋజువు కాగా ఇద్దరికీ 10 సంవత్సరాల కఠినకారగార శిక్ష మరియు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
ప్రాసెక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రావి విజయకుమార్ నిర్వహించారు.( కోర్టు డ్యూటీ ఆఫీసర్ భద్రాచలం టౌన్ నుండి కోర్టు డ్యూటీ ఆఫీసర్) పి. సి.సుధీర్ , కోర్టులైజాన్ ఆఫీసర్ ఎస్. కే.ఏ.ఘని లు సహకరించారు.