భారత్ కు గుడ్ న్యూస్.. స్పోర్ట్స్ కోర్టులో గెలిచిన న్యాయం
వినేశ్‌కు సిల్వర్ మెడల్ ఫిక్స్?
భారత క్రీడాభిమానులకు గుడ్ న్యూస్ ఇది.. వినేశ్ ఫోగాట్ అప్పీల్‌ను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అంగీకరించింది. దీంతో ఆమె సిల్వర్ మెడల్ గెలుచుకునే అవకాశాలపై మళ్లీ ఆశలు చిగురించాయి.
50 కేజీల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ డిస్ క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. 100 గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను ఫైనల్ ఆడనివ్వకుండా రూల్స్ అడ్డుపడ్డాయి. అయితే ఫైనల్ వరకు వినేశ్ ఫోగాట్ ఓవర్ వెయిట్ లేదు.
రెజ్లింగ్‌లో సెమీస్ గెలిస్తే మెడల్ ఫిక్స్ అయినట్టే లెక్కా. కేవలం ఫైనల్‌కు మాత్రమే ఆమె ఉండాల్సినదాని కంటే 100 గ్రాముల బరువు ఎక్కువ ఉన్నారు. మరి సెమీస్ గెలిచినందుకు మెడల్ ఇవ్వాలి కదా అని వినేశ్ కోర్టు తలుపుతట్టారు.
వినేశ్ అప్పిల్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తాజాగా ఆమె అప్పీల్ ను స్వీకరించింది. రేపు ఇందుకు సంబంధించిన తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో వినేశ్‌కు సిల్వర్ మెడల్ ఫిక్స్ అయ్యిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.