అటెండెన్స్ కావాలా అయితే ముద్దు పెట్టు
ఓ కీచక ఉపాద్యాయుడి వీడియో వైరల్
Web desc : సరస్వతీ నిలయమైన పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అశ్లీలంగా ప్రవర్తించాడు. తోటి ఉపాధ్యాయురాలిపై నీచంగా వ్యవహరించాడు. ఆమె హాజరుకు సంబంధించిన విషయాన్ని అడ్డం పెట్టుకుని ముద్దులు అడిగాడు.ముద్దు ఇస్తేనే నీ హాజరు వేస్తానని చెప్పాడు.
అతడి వేషాలు.. వేధింపులను బాధిత ఉపాధ్యాయురాలు వీడియో తీసి ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి బాగోతం బయటపడింది. ఉపాధ్యాయుడి నీచపు బుద్ధిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు తన విధులకు సంబంధించిన హాజరు శాతం విషయమై తోటి ఉపాధ్యాయుడికి చెప్పారు. తన హాజరును ఆమోదం తెలపాలని కోరారు. ‘నీ హాజరు వేయాలంటే నాది ఒక షరతు ఉంది. అది చాలా సరదాగా ఉంటుంది. చాలా సులువు అవుతుంది’ అని ఆ టీచర్ చెబుతాడు.
‘ఏమిటా షరతు’ అని ఉపాధ్యాయురాలు అడగ్గా.. ఆ ఉపాధ్యాయుడు సిగ్గు పడుతూ.. మురిసిపోతూ బుగ్గను చూపిస్తూ ‘ముద్దు కావాలి’ అని కోరాడు. అతడి తీరుపై విస్మయం వ్యక్తం చేసిన మహిళా టీచర్ నిరాకరించింది. ‘నీ షరతుకు నేను అంగీకరించను. ఇది చాలా దరిద్రమైన పని’ అంటూ బదులిచ్చింది. ఇదంతా టీచర్ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశారు.
టీచర్ చేసిన వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. టీచర్ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘అతడి చెంపపై ముద్దు కాదు చెంప చెల్లుమనాల్సి ఉంది’ ఒక నెటిజన్ చెప్పగా.. ‘చెప్పు తీసుకోని కొట్టాలి అతడిని’ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
‘ఇలాంటి టీచర్ల వలనే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతుందని’ మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. అతడిని వెంటనే ఉద్యోగం నుంచి తీసి వేయాలని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వస్తున్నాయి.
కాగా ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల హాజరు నమోదు ఆన్‌లైన్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బందుల నేపథ్యంలో ఆన్‌లైన్ హాజరు నమోదు ఎత్తివేసినట్లు తెలుస్తోంది.
మళ్లీ పాత పద్ధతిలో హాజరు వేయాలనే విధానం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో హాజరు శాతం విషయంలో ఉన్నత ఉద్యోగులు కింది స్థాయి వారిని వేధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీచర్ ముద్దు సంఘటన జరిగింది.