ఇచ్చిన మాట తప్పదు.. వేసే గురి తప్పదు..
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం.
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాలు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాలలో స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాల్లో ముందుగా లక్ష్మీదేవి పల్లి మండలం అశోక్ నగర్ కాలనీలో సుమారు కోటి 50 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించనున్న సైడ్ కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదుకుంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టామని అన్నారు.
అనంతరం అటవీశాఖ వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా లక్ష్మీదేవి పల్లి మండలం చాటకొండ బీట్ లో స్వచ్ఛతనం – పచ్చదనం ముగింపు లో భాగంగా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తర్వాత వన మహోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వన మహోత్సవ లక్ష్యాలని అందరూ సాధించాలని తెలిపారు.
కొత్తగా పోడు వ్యవసాయం ఎవరు చేపట్టరాదని చేపట్టిన యెడల చర్యలు తప్పవని తెలిపారు. పోడు వ్యవసాయం చేసే రైతులకు అటవీ శాఖ అధికారులు జామాయిల్ పెంపకం తదితర పంటలపై అవగాహన కల్పించాలని అన్నారు.
అటవీ శాఖ అధికారులు పోడు వ్యవసాయం నిర్వహిస్తున్న గిరిజనులతో స్నేహభావంగా ఉండాలని అన్నారు. గత సంవత్సరం గిరిజనుల దాడిలో మరణించిన శ్రీనివాస్ రేంజర్ కుటుంబ సభ్యులకు 500 గజాల ఇంటి స్థలం పట్టాని రెవెన్యూ మంత్రిగా త్వరలో అందజేస్తామని తెలిపారు.
పాల్వంచ మండలంలో సుమారు 50 లక్షల వ్యయం తో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్టును ప్రారంభించారు. ఈ టెన్నిస్ కోర్టులో 70 నుంచి 80 మంది నిత్యం శిక్షణ పొందేలా రూపొందించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడా కారులతో కలసి టెన్నిస్ ఆడారు. ఖేలో ఇండియా లో భాగంగా ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని సందర్శించారు.
క్రీడా కారులతో మాట్లాడుతూ శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని, క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణంలో మొక్కను నాటారు.
జిల్లా ఐ డి ఓ సి కార్యాలయ ఆవరణలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా) ద్వారా గ్రూప్ యాక్టివిటీ కింద ఓం సాయిరాం మహిళా సంఘం, వినాయక పేద ప్రాంత సమాఖ్య భరతమాత పట్టణ సమాఖ్య కొత్తగూడెం మున్సిపాలిటీ వారు 6,00,000 రూపాయల బ్యాంకు రుణ సహాయంతో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతో పాటు వారికి ఋణ సదుపాయాలు అందించి వివిద ఆదాయాబివృద్ది కార్యక్రమం చేపట్టుటకు ప్రణాళికలను సిద్దం చేయడం జరిగింది అని అన్నారు.
మహిళా సాదికారతను సాధించుటకు రాబోయే 5 సంవత్సరాలలో చిరు వ్యాపారాలను ప్రోత్సహిస్తూ సంఘ సభ్యులకు నైపుణ్యం పనిలో శిక్షణ ప్యాకింగ్ మరియు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించడం పుడ్ ప్రోససింగ్ యూనిట్స్ ను నెలకొల్పడం మిని ఇండస్ట్రీయల్ పార్క్, వడ్డీ రుణాలు, లోన్స్, మరియు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయుట ద్వారా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామీణ మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో వారికి కావాల్సిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు.
అక్క చెల్లెమ్మలందరు ఆర్థికంగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు.కొత్తగూడెం లో మొత్తం 5 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్ల ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివిధ రకాల ఆహార పదార్ధాలతో క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా శక్తి క్యాంటీన్లలో ఆహారం అమ్మ చేతి వంటలా ఉండాలన్నారు. నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డి ఆర్ డి ఓ విద్యా చందన, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు, కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి,జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు, మెప్మా డీఎంసీ రాజేష్, మహిళా సంఘ సభ్యులు, క్రీడాకారులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.