చండ్రుపట్లలో యాంటీ డ్రగ్ క్యాంపియన్
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలి: ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్
సీ కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలంలో చండ్రుపట్ల గ్రామంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పేరూరు ఎస్ ఐ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్సై కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలని తమ బంగారు భవిష్యత్తుని డ్రగ్స్ మత్తులో పడి నాశనం చేసుకోవద్దని దీనివల్ల కుటుంబాలు బజారున పడవలసి వస్తుందని, జీవితం చాలా విలువైనదని దానిని చిన్న చిన్న ఆనందం కోసం నాశనం చేసుకోవద్దని, మొదట్లో ఆనందాన్నిచ్చిన ఈ డ్రగ్స్ కి అలవాటు పడిపోతే తమ యొక్క జీవితాలే నాశనం అయిపోతాయని, మాదక మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తన యొక్క కుటుంబ బాధ్యతలని నిర్వర్తించాలని ఎస్సై యువతకు పిలుపునిచ్చారు.
ఈ మాదకద్రవ్యాల నిర్మూల, అవగాహనలో కార్యక్రమంలో భాగంగా త్వరలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని డ్రగ్స్ మరియు గంజాయి కి వ్యతిరేకంగా పోరాడుదామని, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం తెలుస్తే పోలీసు వారికి ఈ క్రింది నెంబరుకి 8712670120 ఫోన్ చేసి తెలియజేయాలన, మీ యొక్క సమాచారం గోప్యంగా ఉంచబడునని తెలియజేశారు.
ఎస్పీ గారి ఆదేశాలకు మేరకు చుండ్రుపట్ల మరియు టేకులు గూడెం గ్రామాలలో పోస్టల్ ఆవిష్కరించడం జరిగింది “” డ్రగ్ సమాచారం మాకు నగదు బహుమతి మీకు “” అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.