సింగరేణి ఎన్నికల్లో INTUC హవా…
ఆరు చోట్ల సత్తా చాటిన AITUC
తెలంగాణలో బుధవారం రోజున జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ సంస్థ INTUC, సీపీఐ అనుబంధ సంఘం AITUC సత్తా చాటాయి.
మొత్తం 11 ఏరియాలు ఉండగా.. 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందా యి. గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ అసలు పోటీలో లేకుండా పోయింది.
ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు, గుర్తింపు సంఘం ఎన్నికకు బుధవారం ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర కార్మికశాఖ అధికా రులు తెలిపారు. అత్యధి కంగా ఇల్లెందు ఏరియాలో 98.37 శాతం, అతి తక్కువ గా శ్రీరాంపూర్, రామగుం డం-3 ఏరియాల్లో 93 శాతం ఓట్లు పోలయ్యాయి.
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు.
సింగరేణి ఎన్నికల్లో 13 సంఘాలు పోటీ చేశాయి. ఇందులో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ, కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీ హోరాహోరీగా పోటీ పడ్డాయి.
బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్లోని రామగుండం-1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండం-3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది.
కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, భూపాలపల్లి ఏరియాల్లో ఐఎన్టీయూసీ గెలుపొందాయి.గడిచిన రెండు దఫాల్లో గుర్తింపు సంఘంగా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ పోటీలో లేకుండా పోయింది.
మొదటి నుంచి తాము బరిలో ఉండి ఏరియాలో పట్టు సాధిస్తామని చెప్పుకుంటూనే గనులు, డిపార్ట్ మెంట్లలో ప్రచారాన్ని కొనసాగించిన సదరు నాయకులు ఎన్నికల రోజు కనిపించలేదు.
తమ ప్రత్యర్ధి ఐఎన్టీయూసీ ఈ ఎన్నికల్లో గెలువ కూడదనే ఉద్ధేశ్యంతో ఏఐటీయూసీ కార్మిక సంఘానికి ఇంటర్నల్గా మద్దతు ఇచ్చినట్లు అయింది..