కండక్టర్లపై దాడికి దిగుతున్న మహిళలు
భద్రాచలం జిల్లా : తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో చాలా చోట్ల ఇబ్బందులు ఎదరురవుతున్నాయి.
తాజాగా భద్రాచలం డిపోకు చెందిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కారు. డోర్ దగ్గర ఉన్న మహిళలను లోపలికి రావాలని కోరినందుకు మహిళ కండక్టర్ ను బూతులు తిట్టారని..
తీవ్ర ఇబ్బందికి గురి చేశా రని మహిళా కండక్టర్ మనస్థాపానికి గురయ్యారు బస్సులోంచి కిందకు దిగి ఉద్యోగం చేయలేనని అసహనం వ్యక్తం చేశారు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడడం సరైనది కాదు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకం చాలా మంది మహిళలు ఉపయోగించు కుంటున్నా రు. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
కొందరు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణి స్తున్నారు. అయితే ఓ మహిళా కండక్టర్ లోపలికి రావాలని చెప్పింది.దానికి కొంతమంది మహిళా ప్రయాణికులు ఆమెను దూషించారు. అంతేకా కుండా బస్సు నుంచి ఆమెను దింపేశారు.
తాజాగా, భద్రాచలం లో జరిగిన ఘటనకు పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు .
TS RTCకి సిబ్బంది వెన్నె ముక. వారు అనుని త్యం నిబద్దతతో విధులు నిర్వ ర్తిస్తూ ప్రతి రోజు లక్ష లాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానా లకు చేర్చుతున్నారు.
మహాలక్ష్మి స్కీమ్ అమలు లోనూ కీలకపాత్ర పోషిస్తు న్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైన సిబ్బందిని కొందరు దూషించడం,దాడు లు చేయడం సరికాదు.
ఇలాంటి ఘటనలకు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.
ప్రయా ణ సమయంలో ప్రతి ఒక్కరూ సిబ్బందికి సహక రించి..క్షేమంగా గమ్యస్థానా లకు చేరుకో వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతు న్నాం.అంటూ రాసు కొచ్చారు.