కార్మికుల స్వేచ్ఛపై పంచాయతీ అధికారుల ఉక్కు పాదం….!
స్వతంత్ర దినోత్సవ వేడుకలకు దూరంగా…. చెత్త కుప్పలకు దగ్గరగా…. పంచాయతీ కార్మికులు.
పంద్రా ఆగస్టు నాడు కూడా కార్మికులతో చెత్త ఎత్తిచ్చిన అధికారులు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఆగస్టు 15,
ఎండ వాన చలి అంటూ కాలంతో సంబంధం లేకుండా తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పారిశుద్ధ్య పనులు చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికుల కు స్వతంత్ర దినోత్సవ వేడుకలలో కూడా పాల్గొనే అదృష్టం లేకుండా భద్రాచలం పంచాయతీ అధికారులు చర్యలకు పాల్పడ్డారు.
స్వతంత్ర ఫలాలు అందరికీ సమానంగా అందిన నాడే నిజమైన స్వాతంత్ర దినోత్సవం అని మహనీయులు చెప్పిన మాటలను ఉపన్యాసాలకే పరిమితం చేస్తూ పంద్రాగస్టు నాడు కూడా పంచాయతీ కార్మికులతో చెత్త ఎత్తి వారి నిరంకషత్వాన్ని మరోసారి చాటుకున్నారు. పంద్రాగస్టు నాడు కూడా కార్మికులతో చాకిరీ చేయించిన భద్రాచలం గ్రామపంచాయతీ అధికారుల తీరు ఇప్పుడు వివాదంగా మారింది.
గురువారం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మిఠాయిలు పంచుకుంటూ మహనీయులు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని సంబరం లాగా జరుపుకుంటుంటే భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికులకు మాత్రం సెలవు ఇవ్వక పోగా కనీసం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఆహ్వానించ కుండా విధులలో ఉండాలని ఆదేశించారు. అధికారుల ఆదేశాలతో నిత్యాయ స్థితిలో ఉన్న పంచాయతీ కార్మికులు జెండా పండుగకు దూరంగా మురికి చెత్త కుప్పలకు దగ్గరగా విధులు నిర్వహించారు.
అధికారులు మాత్రం తెల్ల చొక్కాలు ధరించి జేబులకు జాతీయ జెండాలను ఉంచుకొని ఉత్సవాలలో పాల్గొని మిఠాయిలు పంచుకొని జండా ఆవిష్కరణ అనంతరం కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ పంచాయతీ కార్మికుల మాత్రం పంద్రా ఆగస్టు నాడు కూడా చాకిరి చేయించడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.
స్వతంత్ర దినోత్సవం నాడు కూడా పనిచేయడం దుర్మార్గం
గడ్డం స్వామి సిపిఐ ఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి
కార్మికుల హక్కులు చట్టాలను కాలరాటమే కాకుండా భారతదేశ పౌరులకు అందుతున్న కనీస స్వేచ్ఛను కూడా భద్రాచలం పంచాయతీ అధికారులు పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వకపోవడం దారుణం.
స్వాతంత్ర దినోత్సవ నాడు పంచాయతీ కార్మికులతో పనిచేయిస్తున్నారంటే కార్మికుల పట్ల అధికారుల వైఖరి స్పష్టమవుతుంది. దేశ మొత్తం స్వతంత్ర దినోత్సవ వేడుకలను పండగ వాతావరణం జరుపుకుంటుంటే భద్రాచలం కార్మికులు మాత్రం పారిశుద్ధ్య పనులకే పరిమితం అవటం అంటే వారికి ఇంకా స్వతంత్ర ఫలాలు అందడం లేదని స్పష్టమవుతుంది.
స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడ్డ అధికారులపై జిల్లా కలెక్టర్ ఐటిడిఎపిఓ వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో భద్రాచలం పంచాయతీ అధికారులపై కార్మిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం.