కోల్కత్తా అత్యాచార ఘటనపై వైద్యుల నిరసన
పలమనేరు నియోజకవర్గం ఆగస్టు 17 సి కె న్యూస్
కలకత్తాలో, ప్రభుత్వాసుపత్రిలో, జూనియర్ డ్యూటీ డాక్టర్ పై,అత్యంత పాశవికంగా అత్యాచారంచేసి, హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ విషయంపై దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య వర్గాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు ఈరోజు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
ఈ నిరసనలో భాగంగా… పలమనేరు ప్రభుత్వ వైద్యశాల డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆసుపత్రిలో, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ మమతా రాణి మాట్లాడుతూ....
కలకత్తా ఘటన అత్యంత హేయమైనదని, ప్రాణాలు పోసే దేవాలయం లాంటి ఆసుపత్రిలో, ప్రాణాలు పోసే దేవత ప్రాణాలు తీయడం అత్యంత పాశవికమని, చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, భారతదేశంలో వైద్యరంగంలో నూటికి 70 మంది మహిళలే ఉన్నారని,
అటువంటి మహిళలకు రక్షణ లేకపోతే, డ్యూటీలు చేసుకోవడం కష్టం అవుతుందని , అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మమితా దేవ్నాథ్ కు కన్నీటి నివాళులర్పిస్తున్నామని మమతారాణి తెలియజేశారు.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పలమనేర్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ… ఐఎంఏ సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు, ఈరోజు నుండి రేపు ఉదయం వరకు అత్యవసర సేవలు మినహా, ఔట్ పేషెంట్ విభాగాన్ని నిలిపివేయడం జరుగుతుందని, అత్యంత హేయమైన ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని, ఇటువంటి రాక్షసులకు కఠినంగా శిక్షలు పడాల్సిన అవసరం ఉందని, ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ సిబ్బందితో కలిసి తన ఆవేదనను వెలిబుచ్చారు.
డాక్టర్లు మాట్లాడుతూ…. ఇటువంటి హేయమైన పాశవికమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చట్టాలు రావాల్సిన అవసరం ఉందని, డాక్టర్లు డ్యూటీలో ఉన్నప్పుడు రోగుల బంధువులు డాక్టర్లపై దాడి చేస్తున్నారని, అటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని, బలమైన చట్టాలు ఉన్నప్పుడే ఇటువంటివి జరగకుండా నిరోధించగలరని ఈ ఈ సందర్భంగా డాక్టర్లు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు .
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ఫ్ల కార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు ,
ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్లు …మమతారాణి, యుగంధర్, శారద. నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.